మ్యాడ్ స్క్వేర్ సహా.. ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు ఇవే..
25 April 2025
Prudvi Battula
పృథ్వీరాజ్ దర్శకత్వంలో మోహన్‌లాల్ హీరోగా వచ్చిన 'L2: ఎంపురాన్' జియో హాట్‌స్టార్ వేదికగా ఏప్రిల్ 24 నుంచి ప్రసారం అవుతోంది.
నరేన్ నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ నటించిన యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ 'మ్యాడ్ స్క్వేర్' ఏప్రిల్ 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
విక్రమ్ హీరోగా నటించిన 'వీర ధీర సూరన్ పార్ట్ 2' అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏప్రిల్ 25 నుంచి తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీలో స్ట్రీమ్ అవుతుంది.
సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో 'జ్యువెల్ థీఫ్' అనే హై-స్టేక్స్ యాక్షన్ థ్రిల్లర్ ఏప్రిల్ 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేస్తుంది.
హిందీ చిత్రం 'క్రేజీ' అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ ఏప్రిల్ 25 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
రియో రాజ్, భారతి రాజా ప్రధాన పాత్రల్లో రూపొందిన 'నిరమ్ మారుమ్ ఉలగిల్' సన్ నెక్ట్స్ వేదికగా ఏప్రిల్ 25 నుంచి అందుబాటులో ఉంది.
'బుల్లెట్ ట్రైన్ ఎక్స్‌ప్లోజన్' అనే ఓ జాపనీస్ మూవీ ఏప్రిల్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.
దర్శకుడు రమేష్ ఇందిర రూపొందించిన 'అయ్యన్న మానే' ఏప్రిల్ 25 నుంచి జీ5లో స్ట్రీమ్ అవుతుంది. ఇది తొలి కన్నడ సస్పెన్స్ ఫ్యామిలీ థ్రిల్లర్ సిరీస్.
మరిన్ని వెబ్ స్టోరీస్
అనసూయ యాంకరింగ్ చేసిన టీవీ షోలు ఇవే..
శ్రీదేవి మరణానికి ఉప్పు కారణమని మీ తెలుసా.?
డ్యూయల్ రోల్స్ చేసి మెప్పించిన టాలీవుడ్ ముద్దుగుమ్మలు వీరే..