మకాం మార్చిన రష్మిక.. అక్కడే కొన్నాళ్ళు ఉంటానంటూ..
29 April 2025
Rajeev
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది రష్మిక మందన్న.
నేషనల్ క్రష్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ వయ్యారి. ఇప్పుడు చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉంటుంది.
తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది.
రీసెంట్ గా యానిమల్, పుష్ప 2, ఛావా సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది. అలాగే ఈ చిన్నది ఇప్పుడు బడా హీరోల సినిమాల్లోనూ నటిస్తుంది.
చివరిగా సల్మాన్ ఖాన్ తో చేసిన సికిందర్ సినిమా రష్మిక స్పీడ్ కు బ్రేకులేసింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
ప్రస్తుతం రష్మిక ధనుష్ తో కుబేర సినిమా చేస్తుంది. ఆ సినిమాతో పాటు గర్ల్ ఫ్రెండ్ సినిమాలో నటిస్తుంది.
ఇదిలా ఉంటే రీసెంట్ గా రష్మిక ఊటీలో కొన్నాళ్లు ఉంటానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. షూటింగ్ కోసం అక్కడికివెళ్ళిందా లేక.. అక్కడికి మకాం మరిచేసిందా అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.