Actor Chinna: పెద్ద హీరో అయ్యుండి నా కాళ్ల దగ్గర కూర్చున్నాడు.. ఆరోజు మర్చిపోలేను.. టాలీవుడ్ నటుడు..
టాలీవుడ్ ఇండస్ట్రీలో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు చిన్నా. గతంలో ఓ ఇంటర్వ్యూలో చిన్న తన సినీ జీవితంలోని పలు కీలక సంఘటనలను పంచుకున్నారు. బాలకృష్ణతో కలిసి చేసిన రైలు ప్రయాణం, ఆయన సరదా స్వభావం, పంచుకున్న భోజనం వంటి విషయాలు ఆసక్తిని రేకెత్తించాయి. మహేష్ బాబు కుటుంబంతో ఆయనకు ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని, మురారి సినిమా షూటింగ్ జ్ఞాపకాలను కూడా పలు విషయాలు పంచుకున్నారు.

టాలీవుడ్ నటుడు చిన్నాగురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు హీరోగా.. తర్వాత నటుడుగా, విలన్ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గతంలో ఒక ఇంటర్వ్యూలో తన సినీ జీవితంలోని ఆసక్తికరమైన విశేషాలను, ప్రముఖ నటీనటులతో తనకున్న అనుబంధాలను పంచుకున్నారు. మేకప్ తీశాక ఇల్లు, పిల్లలు, భార్య తప్ప తనకు ఇంకేమీ తెలియదని, పబ్బులు, నైట్ క్లబ్‌లు, డ్యాన్సింగ్ పబ్బుల గురించి తెలియదని ఆయన స్పష్టం చేశారు. తన సినీ స్నేహితుల గురించి ప్రస్తావిస్తూ, శివాజీరాజా, శుభలేఖ సుధాకర్, నరేష్ వంటివారు ఇప్పటికీ తన పుట్టినరోజుకు ఫోన్ చేస్తారని, గోల్కొండ హోటల్‌కు వచ్చినప్పుడు తనకు ఫోన్ చేసి కలుస్తారని చిన్న తెలిపారు. వారితో కలిసి బ్లాక్ లేబుల్ పానీయం, మామిడి రసం, మంచి ఆహారం తీసుకుంటూ కాలక్షేపం చేస్తానని వివరించారు. రామ్ జగన్ కూడా తనకు బాగా క్లోజ్ అని పేర్కొన్నారు. శ్రీకాంత్‌తో కూడా ఒకప్పుడు సన్నిహితంగా ఉండేవాడినని, పార్టీలకు వారి ఇంటికి వెళ్లేవాడినని చిన్న గుర్తు చేసుకున్నారు. బాలకృష్ణతో తనకున్న మరుపురాని అనుభవాన్ని చిన్న వివరంగా వివరించారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : తొలి సూపర్ స్టార్ కమెడియన్.. ఖరీదైన కారులో ప్రయాణించి.. 44 ఏళ్ళ వయసులోనే రైల్వే స్టేషన్ రోడ్డు మీద అనాథలా..
ఒకసారి బ్రాహ్మణి వివాహ పత్రికలను ఎంపిక చేయడానికి బాలకృష్ణ వస్తున్నారని, తాను షూటింగ్‌తో హైదరాబాద్‌లో ఉన్నానని తెలిపారు. ఇద్దరికీ ఒకే కూపేలో ఫస్ట్ క్లాస్ టికెట్లు వేయమని బాలకృష్ణ అడగగా, ఆ రోజు టికెట్లు దొరకలేదని, అప్పుడు వైజాగ్ ఎంపీ జనార్ధన్ రెడ్డి గారి పీఏ ద్వారా ఎంపీ కోటాలో టికెట్లు అలాట్ చేయించుకుని ప్రయాణించామని చిన్న చెప్పారు. రైలు ఎక్కగానే బాలకృష్ణ దేవుడి ఫోటోలు పెట్టుకున్నారని, కాకినాడ నుండి రాజమండ్రికి వచ్చాక, నిర్మాత కొండా కృష్ణంరాజు పంపిన పెద్ద క్యారియర్ భోజనం వచ్చిందని తెలిపారు. ఒక రెండు డ్రింక్స్ అయ్యాక, భోజనం చేద్దామా అని బాలకృష్ణ అడగ్గా, తాను ఇంకోటి తీసుకుంటానని చెప్పి, కలిసి భోజనం చేశామని అన్నారు. బాలకృష్ణకు ఆయన మామ వేస్తారని చెప్పే “కబ్బా” (పాకెట్) కథను చిన్న గుర్తు చేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : K. Raghavendra Rao : నా జీవితంలో ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని సాంగ్ అది.. తెలుగు చరిత్రలో ఒక గొప్ప మైలురాయి.. రాఘవేంద్రరావు..
భోజనం తర్వాత ఫస్ట్ క్లాస్ ఏసీలో అటెండర్ ఉన్నప్పటికీ, బాలకృష్ణ స్వయంగా ప్లేట్ తీసుకెళ్లి డస్ట్‌బిన్‌లో వేసి, ప్లేట్ కడుక్కున్నారని చిన్న ఆశ్చర్యంగా చెప్పారు. తర్వాత తనను పైన పడుకుంటావా, కింద పడుకుంటావా అని అడగ్గా, తాను కింద పడుకున్నానని, బాలకృష్ణ పైన పడుకున్నారని తెలిపారు. తెల్లవారుజామున 3:30 గంటలకు తనకు మెలకువ వచ్చి లేచి చూస్తే, బాలకృష్ణ తన కాళ్ల దగ్గర కూర్చుని పంచాంగం చదువుతున్నారని, ఆ దృశ్యం చూసి తాను చటుక్కున లేచానని చిన్న వివరించారు. బాలకృష్ణ “నువ్వు పడుకో” అని చెప్పినా, ఆయన కాళ్ల దగ్గర కూర్చుంటే ఏదోగా ఉందని చెప్పి, తాను పైకి వెళ్లి పడుకున్నానని అన్నారు. ఉదయం 6:30 గంటలకు చిన్నను లేపి, మౌలాలి వచ్చిందని, నెక్స్ట్ దిగాలి కాబట్టి లగేజ్ సర్దుకోమని చెప్పారని అన్నారు. బాలకృష్ణకు మూడు, నాలుగు బ్యాగులు ఉంటే, తనకు ఒక్కటే బ్యాగు అని చిన్న పేర్కొన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : వామ్మో.. ఇదేక్కడి క్రేజ్ భయ్యా.. 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సిరీస్..
అదే రోజు సాయంత్రం బాలకృష్ణ చిన్నకు ఫోన్ చేసి, రాత్రి భోజనం గురించి అడిగారని, అప్పటికే తన భార్య పాయ, పరోటాలు చేసిందని చిన్న చెప్పారు. తాను బాక్సులో తీసుకెళ్లిన ఆహారాన్ని బాలకృష్ణ చాలా తృప్తిగా తిన్నారని, తర్వాత తన భార్యకు ఫోన్ చేసి, “అమ్మా తల్లి అద్భుతంగా చేశావమ్మా, చాలా థాంక్స్” అని చెప్పారని చిన్న గుర్తు చేసుకున్నారు. బాలకృష్ణ చాలా సరదాగా, చిన్నపిల్లాడిలా అయిపోతారని, ఆయనకు కోపం కూడా ఎక్కువే ఉంటుందని, అది మన ప్రవర్తనను బట్టి ఉంటుందని చిన్న అభిప్రాయపడ్డారు. ప్రేమ ఎక్కువ ఉన్నవాళ్లకు కోపం కూడా ఎక్కువే ఉంటుందని ఆయన అన్నారు.
బాలకృష్ణ..

Balakrishna
సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
