టాలీవుడ్‌లో అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు.
మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఆమె.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది.
ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు దక్కించుకోవడంతో మీనాక్షి క్రేజ్ క్రమంగా పెరిగింది.
మోడలింగ్‌లోకి అడుగుపెట్టిన ఆమె 2018లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు. అదే ఏడాది మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలోనూ భారత్ తరఫున పాల్గొని ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది