సినిమాలకు బ్రేక్ ఇచ్చినా.. సోషల్ మీడియాలో మాత్రం ఊపేస్తోంది
15 September 2026
Rajeev
Pic credit - Instagram
కన్నడ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఆమె.. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది.
మోడలింగ్‌లోకి అడుగుపెట్టిన ఆమె.. 2010లో కన్నడ చిత్రం పోర్కితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అదే ఏడాది ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
ఏం పిల్లో ఏం పిల్లడో. ఈ సినిమాలో ఆమె తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత సిద్ధార్థ్ హీరోగా నటించిన బావ సినిమాలో కనిపించింది.
ఈ సినిమా తర్వాత తెలుగులో ఆమెకు మరిన్ని అవకాశాలు రావడం మొదలైంది. ప్రణీత కెరీర్‌ను మలుపుతిప్పిన సినిమా మాత్రం అత్తారింటికి దారేది అని చెప్పుకోవచ్చు.
సినిమా ఘన విజయం సాధించడంతో ఆమెకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ వచ్చింది. 2014లో వచ్చిన పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలో ప్రణీత నటించింది.
అదే ఏడాది జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన రభస సినిమాలో కూడా ప్రణీత హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో ఆమె పాత్రకు మంచి స్పందన లభించింది.
టాలీవుడ్‌లో వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావడం అప్పట్లో ప్రణీతకు ఉన్న క్రేజ్‌కు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కెరీర్ పీక్ లో ఉండగానే పెళ్లి చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.