AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఆడియెన్స్‌ను నవ్వించి భయపెడుతోన్న మలయాళం హారర్ థ్రిల్లర్.. ఓటీటీలో టాప్ ట్రెండింగ్.. తెలుగులోనూ..

గత వారమే ఓటీటీలోకి వచ్చిన ఈ మలయాళం కామెడీ హారర్ థ్రిల్లర్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. ఓవైపు నవ్విస్తూనే మరోవైపు భయపెడుతోన్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉండడంతో ఈ సినిమాను తెగ చూసేస్తున్నారు.

OTT Movie: ఆడియెన్స్‌ను నవ్వించి భయపెడుతోన్న మలయాళం హారర్ థ్రిల్లర్.. ఓటీటీలో టాప్ ట్రెండింగ్.. తెలుగులోనూ..
OTT Movie
Basha Shek
|

Updated on: Sep 16, 2026 | 7:55 AM

Share

ఈ వారం ఓటీటీల్లో పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇప్పటికే తెలుగు బోల్డ్ సినిమా రీసెంట్ సెన్సేషనల్ హిట్ ‘ఇరుముడి’, మొదరాత్రి, తుడక్కం, లస్ట్ స్టోరీస్ 3 వంటి సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు ఆడియెన్స్ కు వినోదం పంచునున్నాయి. ఈ వారం సినిమాలు, సిరీస్ ల సంగతి పక్కన పెడితే గత వారం ఓటీటీలోకి వచ్చిన ఒక సినిమా ఇప్పుడు ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇదొక మలయాళం కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ. సినిమాల్లో ఆడియెన్స్ ను ఆకట్టుకున్న ఈ మూవీ గత వారమే రెండు ఓటీటీల్లోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఒరిజినల్ మలయాళం వెర్షన్ తో పాటు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. యూత్‌ఫుల్ కాలేజ్ డ్రామాకు హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమాను రూపొందించారు. ఓ వైపు నవ్విస్తూనే మరో వైపు భయపెట్టే ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఇంజినీరింగ్ కాలేజ్‌లో జాయిన్ అయిన ముగ్గురు కుర్రాళ్ల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అరవింద్ , వర్కీ , మిథున్ లు కాలేజ్ క్యాంపస్ లో ఉంటూ ఫుల్‌గా ఎంజాయ్ చేయాలని, నైట్ పార్టీలకు డబ్బులు దాచుకోవాలని ప్లాన్ వేస్తారు. అందు కోసం తక్కువ రెంట్‌కి దొరికే ఒక ప్రైవేట్ హాస్టల్ లో చేరుతారు.

అయితే కాలేజీలో సీనియర్స్ ఇచ్చిన పనిష్మెంట్ లో భాగంగా ముగ్గురు ఫ్రెండ్స్ అర్ధరాత్రి దట్టమైన అడవిలో ఉన్న ఒక పాడుబడిన గుడిలోకి వెళ్లాల్సి వస్తుంది. విషయం తెలియక అక్కడ ఉన్న ఒక భయంకరమైన దుష్టశక్తిని వీళ్లు నిద్రలేపుతారు. దీంతో ఆ ఆత్మ గుడి నుంచి నేరుగా వీళ్లు ఉంటోన్న హాస్టల్ కు వస్తుంది. మరి ఆ దెయ్యం కారణంగా ముగ్గురు కుర్రాళ్ల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? ఆ దెయ్యం బారి నుంచి ఈ ముగ్గురు ఎలా ప్రాణాలు దక్కించుకున్నారు? అసలు ఆ దుష్టశక్తి వెనక ఉన్న హిస్టరీ ఏంటి? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్రస్తుతం ఓటీటీలో టాప్ లో ట్రెండ్ అవుతోన్న ఈ సినిమా పేరు ‘మహారాజా హాస్టల్’ (Maharaja Hostel). చారు వాకన్ తెరకెక్కించిన ఈ హారర్ కామెడీలో అఖిల్ NRD, అఖిల్ షా, శరత్ బాబు, సజిన్ చెరుకయిల్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ‘మహారాజా హాస్టల్’ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

మహారాజా హాస్టల్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సింహరాశిలో కేతు-మంగళ యోగం.. వీరికి ఊహించని మార్పులు!
సింహరాశిలో కేతు-మంగళ యోగం.. వీరికి ఊహించని మార్పులు!
ప్రముఖ యూట్యూబర్‌ మధుమిత పరార్‌.. భారీగా పెరిగిన ఫాలోవర్లు!
ప్రముఖ యూట్యూబర్‌ మధుమిత పరార్‌.. భారీగా పెరిగిన ఫాలోవర్లు!
ఐదో వారం ఓటింగ్‌లో దుమ్మురేపుతున్న ఆ ముగ్గురు..
ఐదో వారం ఓటింగ్‌లో దుమ్మురేపుతున్న ఆ ముగ్గురు..
అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
'పుష్ప' ముద్దు సీన్‌ను రీక్రియేట్ చేసిన స్వీడన్ దంపతులు.. వీడియో
'పుష్ప' ముద్దు సీన్‌ను రీక్రియేట్ చేసిన స్వీడన్ దంపతులు.. వీడియో
NEET PG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌.. అక్టోబర్ 12 నుంచి దరఖాస్తులు
NEET PG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌.. అక్టోబర్ 12 నుంచి దరఖాస్తులు
APPSC గ్రూప్‌ 1కు ఇంకా మూడున్నర నెలలే.. పరీక్ష విధానం ఇలా ఉంటుంది
APPSC గ్రూప్‌ 1కు ఇంకా మూడున్నర నెలలే.. పరీక్ష విధానం ఇలా ఉంటుంది
ప్రతిరోజూ ఉదయం చియా,సబ్జా విత్తనాలు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
ప్రతిరోజూ ఉదయం చియా,సబ్జా విత్తనాలు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
అక్టోబర్ 8 రాశిఫలాలు: ఆ రాశులకు ధన లాభం, కుటుంబంలో సంతోషం
అక్టోబర్ 8 రాశిఫలాలు: ఆ రాశులకు ధన లాభం, కుటుంబంలో సంతోషం
ఫేస్ బుక్ కామెంట్‌తో ప్రాణాల మీదకు.. సౌదీలో శ్రీలంక వాసికి ఉరి
ఫేస్ బుక్ కామెంట్‌తో ప్రాణాల మీదకు.. సౌదీలో శ్రీలంక వాసికి ఉరి