అతడు పెన్ను పడితే పూనకమే.. ఆ డైరెక్టర్ కథ రాస్తే తిరుగుండదు.. విలన్లకు కూడా హీరో ఎలివేషన్ ఇస్తాడు..
తెలుగు సినిమా ప్రపంచంలో ఎంతో మంది దర్శకులు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. అలాగే ఒక్కో దర్శకుడి మేకింగ్ స్టైల్, హీరో, విలన్ క్యారెక్టరైజేషన్ ఒక్కో విధంగా ఉంటాయి. కానీ హీరోకు మాస్ ఎలివేషన్.. విలన్ కు స్టైలీష్ ఎలివేషన్ ఇవ్వడం కేవలం ఆ ఒక్క డైరెక్టర్ కే సాధ్యం. అతడు మూడ్ లో ఉండి కథ రాస్తే తిరుగుండదు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ?

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మేకింగ్, క్యారెక్టరైజేషన్స్ ఎంత డిఫరెంట్‌గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాల్లో హీరోలకే కాకుండా సపోర్టింగ్ క్యారెక్టర్స్, విలన్లకు కూడా ఒక ప్రత్యేకమైన మ్యానరిజం ఉంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సీనియర్ నటుడు బ్రహ్మాజీ, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘ఏక్ నిరంజన్’ (2009) సినిమా షూటింగ్ విశేషాలను, పూరి రైటింగ్ స్టైల్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘ఏక్ నిరంజన్’ సినిమాలో విలన్ సోనూ సూద్ (వేద) పక్కన ఉండే కుడిభుజం లాంటి పాత్రలో బ్రహ్మాజీ నటించారు. ఈ చిత్రంలో వీరిద్దరి మధ్య వచ్చే సీన్లు థియేటర్లలో ప్రేక్షకులను విపరీతంగా నవ్వించాయి. “ఎవరైనా నన్ను విలన్ అనుకుంటున్నారా.. హీరో అనుకుంటున్నారా?” అంటూ సోనూ సూద్ అడిగే డైలాగ్, దానికి బ్రహ్మాజీ ఇచ్చే కౌంటర్లు ఇప్పటికీ మీమ్స్‌లో ట్రెండ్ అవుతుంటాయి. ఈ క్యారెక్టర్ గురించి బ్రహ్మాజీ మాట్లాడుతూ, “ఏక్ నిరంజన్ సినిమాలో నా పాత్రను ఎప్పుడు చూసుకున్నా నాకు బాగా నవ్వొస్తుంది. నేను, సోనూ సూద్ ఆ సీన్లను బాగా ఎంజాయ్ చేస్తూ నటించాం. ఆ తర్వాత మళ్లీ మా ఇద్దరి కాంబినేషన్ అంతగా కుదరలేదు కానీ, ఆ సినిమాలో మా ఇద్దరి మధ్య ఉన్న చిన్న కెమిస్ట్రీ, టైమింగ్ చాలా బాగా పేలింది” అని పేర్కొన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : నవ్వుల రారాజును వెంటాడిన మృత్యువు.. రెండుసార్లు గెలిచినా.. వదలని మరణం..
డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి గురించి చెబుతూ.. “పూరి స్టైల్ పూర్తిగా డిఫరెంట్‌గా ఉంటుంది. ఆయన ఒక్కసారి మూడ్‌లోకి వచ్చి పెన్ను పెట్టారంటే, ఆ క్యారెక్టర్లు, డైలాగులు రాయడంలో తిరుగుండదు. ఆయన రైటింగ్ స్టైల్ అదిరిపోతుంది. ఏక్ నిరంజన్ సినిమాలో మా ఇద్దరి కామెడీ ట్రాక్ అంతలా హైలైట్ అవ్వడానికి కారణం పూరి పెన్ను నుండి వచ్చిన పవర్ఫుల్ అండ్ ఫన్నీ డైలాగ్స్. సినిమా ఆశించిన స్థాయి విజయం సాధించకపోయినప్పటికీ, థియేటర్ల నుండి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ సోనూ సూద్, నా క్యారెక్టరైజేషన్ గురించే మాట్లాడుకున్నారు. హీరోతో పాటు మా పాత్రలు కూడా అంతలా ఎలివేట్ అయ్యాయంటే అది పూరి రైటింగ్ స్కిల్స్ వల్లే సాధ్యమైంది” అని బ్రహ్మాజీ అన్నారు. ప్రస్తుతం బ్రహ్మాజీ చేసిన ఈ వ్యాఖ్యల షార్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎక్కువ మంది చదివినవి : ఇప్పుడున్న హీరోలలో అతడు ది బెస్ట్.. అతడి యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టం.. కృష్ణ మనసులోని మాట..
ఇక పూరి జగన్నాథ్, బ్రహ్మాజీ కాంబోలో పలు చిత్రాలు వచ్చాయి. నిజానికి పూరి తన సినిమాల్లో క్యారెక్టర్స్‌ను చాలా రఫ్ అండ్ పవర్‌ఫుల్‌గా ప్రెసెంట్ చేస్తుంటారు. బిజినెస్ మెన్, ఏక్ నిరంజన్ వంటి చిత్రాలు వీరి కాంబోలో వచ్చాయి. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి హీరోగా రూపుదిద్దుకుంటున్న లేటెస్ట్ భారీ యాక్షన్ డ్రామా “స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోడ్”. ఇందులో సైతం బ్రహ్మాజీ ఒక కీ-రోల్ పోషిస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : పవన్ కళ్యాణ్, మహేష్ బాబులతో సినిమాలు… కట్ చేస్తే.. 51 ఏళ్ల వయసులో ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్..
పూరి జగన్నాథ్ ఫోటోే..

Puri Jagannadh Photo
ఎక్కువ మంది చదివినవి : Tollywood : అరుంధతి మూవీలో సోనుసూద్ క్యారెక్టర్ నేను చెయ్యాలి.. కానీ ఎలా మిస్సైందంటే..
