మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. ఆచార్య అప్‌డేట్ వచ్చేసింది.. టీజర్ ఎప్పుడంటే..

మెగా అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఆచార్య సినిమా పై చిత్రయూనిట్ కీలక అప్ డేట్ ఇచ్చేసింది. జనవరి 29  సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు

  • Ravi Kiran
  • Publish Date - 10:09 am, Wed, 27 January 21
మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. ఆచార్య అప్‌డేట్ వచ్చేసింది.. టీజర్ ఎప్పుడంటే..

Acharya Teaser: మెగా అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఆచార్య సినిమాపై చిత్రయూనిట్ కీలక అప్‌డేట్ ఇచ్చేసింది. జనవరి 29వ తేదీ సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ఈసినిమా టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు దర్శకుడు కొరటాల శివ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే చరణ్ కూడా సెట్‌లో అడుగు పెట్టాడు. చరణ్ చిరులపై కీలక సన్నివేశాలను కొరటాల తెరకెక్కిస్తున్నాడు.

కాగా  ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తుంది. చరణ్ కు జోడిగా పూజ హెగ్డే నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చివరి దశ చిత్రీకరణ జరపుకుంటున్న ఈ సినిమాను మే 9న రిలీజ్‌ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.