హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న ‘డిస్కోరాజా’ విలన్.. ఆకట్టుకుంటున్న ‘రేజ్ ఆఫ్ రుద్ర’ వీడియో..

జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహా నటిస్తున్న చిత్రం 'వసంత కోకిల'. ఆర్.టీ ఎంటర్ టైన్మెంట్స్, ముద్ర ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై రజనీ తాళ్లూరి, రేష్మీ

హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న 'డిస్కోరాజా' విలన్.. ఆకట్టుకుంటున్న 'రేజ్ ఆఫ్ రుద్ర' వీడియో..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 27, 2021 | 10:02 AM

జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహా నటిస్తున్న చిత్రం ‘వసంత కోకిల’. ఆర్.టీ ఎంటర్ టైన్మెంట్స్, ముద్ర ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై రజనీ తాళ్లూరి, రేష్మీ సింహా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నర్తన శాళ ఫేం కశ్మీర పర్దేశి హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ సినిమాను తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‏కు విశేషస్పందన లభించింది. తాజాగా మంగళవారం ఈ చిత్ర మోషన్ పోస్టర్ ‘రేజ్ ఆఫ్ రుద్ర’ పేరుతో విడుదల చేశారు మేకర్స్.

థ్రిల్లింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్ ఎఫెక్ట్స్, బాబీ సింహా లుక్ ఆకట్టుకుంటోంది. రాజేష్ మురుగేషన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దీనికి హైలెట్ అనే చెప్పాలి. రొమాంటిక్ థ్రిల్లర్‏గా రానున్న వసంత కోకిల సినిమాను దర్శకుడు రమణన్ తెరకెక్కిస్తున్నాడు. జాతీయ అవార్డు గ్రహీత, విలక్షనణ హీరో కమల్ హాసన్, శ్రీదేవి కాంబోలో వచ్చిన వసంత కోకిల సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఇక అదే టైటిల్‎‏తో రాబోతున్న ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సాధిస్తూందో చూడాలి. ఈ మూవీ ఆడియో రైట్స్‏ను థింక్ మ్యూజిక్ సంస్థ సొంతం చేసుకుంది.

Also Read:

Actor Vishal: థియేటర్ల వైపే విశాల్ అడుగులు.. ‘చక్ర’ సినిమా విడుదలకు ముహుర్తం ఫిక్స్..