Ram Pothineni: రామ్‌ ప్రేమ పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న క్రేజీ హీరో.?

Ram Pothineni: 'నిన్నే పెళ్లాడుకొని రాజై పోతా' అని సినిమాల్లో పాటలు పాడుకున్న యంగ్‌ హీరో రామ్‌ పోతినేని ఇప్పుడు నిజ జీవితంలో పెళ్లి కొడుకుగా మారనున్నాడా.? ఈ ఎనర్జిటిక్‌ స్టార్‌ త్వరలోనే ఓ ఇంటి వాటు వాడు కాబోతున్నాడా.?

Ram Pothineni: రామ్‌ ప్రేమ పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న క్రేజీ హీరో.?
Follow us

|

Updated on: Jun 26, 2022 | 8:43 PM

Ram Pothineni: ‘నిన్నే పెళ్లాడుకొని రాజై పోతా’ అని సినిమాల్లో పాటలు పాడుకున్న యంగ్‌ హీరో రామ్‌ పోతినేని ఇప్పుడు నిజ జీవితంలో పెళ్లి కొడుకుగా మారనున్నాడా.? ఈ ఎనర్జిటిక్‌ స్టార్‌ త్వరలోనే ఓ ఇంటి వాటు వాడు కాబోతున్నాడా.? అంటే.. అవుననే సమాధానం వస్తోంది. టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌లో రామ్‌ ఒకరు. కెరీర్‌లో మంచి విజయాలతో దూసుకుపోతున్న రామ్‌ ఇప్పటి వరకు పెళ్లి విషయంలో మాత్రం మాట దాటవేస్తూ వచ్చాడు. అయితే తాజా సమాచారం ప్రకారం రామ్‌ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని సమాచారం. రామ్‌ ప్రేమ వివాహం చేసుకోనున్నాడని టాలీవుడ్‌ వర్గాలు కోడై కూస్తున్నాయి.

బాల్య స్నేహితురాలు, స్కూల్‌ మేట్‌తో రామ్‌ గతకొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నాడని సమాచారం. అయితే కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న ఈ క్యూట్‌ కపుల్స్‌ తాజాగా తమ పేరెంట్స్‌కి ప్రేమ విషయం చెప్పడం, ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని తెలుస్తోంది. ఈ విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. రామ్‌ నటిస్తున్న తాజా చిత్రం వారియర్‌ చిత్రాన్ని పూర్తి చేయగానే వివాహం చేసుకోనున్నాడని ఆ తర్వాతే బోయపాటి సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్నాడని టాక్‌ నడుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

రామ్‌ కెరీర్‌ విషయానికొస్తే 2006లో దేవదాసు సినిమాతో ఇండస్ట్రీ ఇచ్చిన ఈ యంగ్‌ హీరో తొలి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. 2016లో వచ్చిన ‘నేను జైలజా’ తర్వాత పలు పరాజయాలను ఎదుర్కొన్న రామ్‌ ఆ తర్వాత 2019లో పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్‌’తో మరోసారి భారీ విజయాన్ని అందుకుని సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం