
Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ 5వ సీజన్ ఎట్టకేలకు తుది దశకు చేరుకుంది. గత కొన్ని వారాలుగా ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోన్న ఈ రియాలిటీ షో విన్నర్ ఎవరో వచ్చే ఆదివారం తేలిపోనుంది. ప్రస్తుతం హౌజ్‌లో శ్రీరామచంద్ర, మానస్, సిరి, సన్నీ, షన్ను మిగిలారు. వీరిలో బిగ్‌బాస్ టైటిల్‌ను ఎవరు సాధిస్తారనేదానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. డిసెంబర్ 19న తుదిపోరుకు సర్వం సిద్ధమైంది. ఇదిలా ఉంటే ప్రతీ సీజన్ గ్రాండ్ ఫినాలేను బిగ్‌బాస్ యాజమాన్యం అంగరంగవైభవంగా జరుపుతుందనే విషయం తెలిసిందే. టాప్ సెలబ్రిటీ చేత బిగ్‌బాస్ విన్నర్‌ను ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది.
అయితే ఇప్పటి వరకు కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వారు మాత్రమే విజేతను ప్రకటించారు. కానీ 5వ సీజన్ కోసం మాత్రం ఏకంగా బాలీవుడ్ స్టార్‌లు రంగంలోకి దిగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిలో ముఖ్యంగా రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే, అలియా భట్ ఈ గ్రాండ్ ఫినాలేకు వస్తున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. వీరితో పాటు రామ్‌చరణ్ కూడా సందడి చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఆర్.ఆర్.ఆర్ టీమ్ కూడా గ్రాండ్ ఫినాలేలో కాసేపు తళుక్కుమనున్నారని టాక్ నడుస్తోంది. మరి వీటంన్నింటిలో ఏది నిజమో తెలియాలంటే ఇంకో ఐయిదు రోజులు ఆగాల్సిందే.
Also Read: Beauty Tips: చలికాలంలో మీ మొహం మిలమిల మెరిసేందుకు ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి.. అదేంటంటే..?
EPFO Nominee: మీ పీఎఫ్ ఖాతాకు నామినీ పేరు చేర్చారా..? గడువు దగ్గర పడుతోంది..!
Big News Big Debate: జనసేనాని ఎటాక్.. వైసీపీ కౌంటర్ ఎటాక్.. ఏపీలో మరోసారి వేడెక్కిన రాజకీయం..