ఖాతర్నాక్ సినిమాకు కలెక్టర్ స్ఫూర్తి.. రవిబాబు ఏం మాయచేసాడో

నాటి వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలిపై.. డైరెక్టర్ రవిబాబు.. పలు ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్ చేశారు. నా కథకు కారణం ఆమ్రపాలినే అని.. ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజాగా తెలిపారు. మొదటినుంచీ.. వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ.. సినిమాలను తీయడంలో.. రవిబాబుది అందవేసిన చేయి. అల్లరి, నచ్చావులే, అనసూయ, అవును, అవును-2, అదిగో పందిపిల్ల వంటి పలు చిత్రాల ద్వారా తనదైన మార్కుతో.. తనకంటూ.. టాలీవుడ్‌లో ఓ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకున్నారు రవిబాబు. అంతేకాకుండా.. ఆయన ఎక్కువగా.. […]

ఖాతర్నాక్ సినిమాకు కలెక్టర్ స్ఫూర్తి.. రవిబాబు ఏం మాయచేసాడో
Follow us

| Edited By:

Updated on: Oct 31, 2019 | 11:01 AM

నాటి వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలిపై.. డైరెక్టర్ రవిబాబు.. పలు ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్ చేశారు. నా కథకు కారణం ఆమ్రపాలినే అని.. ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజాగా తెలిపారు.

మొదటినుంచీ.. వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ.. సినిమాలను తీయడంలో.. రవిబాబుది అందవేసిన చేయి. అల్లరి, నచ్చావులే, అనసూయ, అవును, అవును-2, అదిగో పందిపిల్ల వంటి పలు చిత్రాల ద్వారా తనదైన మార్కుతో.. తనకంటూ.. టాలీవుడ్‌లో ఓ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకున్నారు రవిబాబు. అంతేకాకుండా.. ఆయన ఎక్కువగా.. సస్పెన్స్, థ్రిల్లర్, హర్రర్ చిత్రాలను తీయడానికే ప్రాధాన్యం ఇస్తూంటారు.

కాగా.. ఇప్పుడు ఆయన కథలోకి.. కలెక్టర్ ఆమ్రపాలి ఎందుకొచ్చారంటే.. ఆయన ‘అదుగో’ సినిమా చేస్తున్న సమయంలో.. టీవీలో వరంగల్‌ జిల్లాకి కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆమ్రపాలి గురించి ఓ న్యూస్ వచ్చింది. తన కలెక్టరేట్ భవనంలో దెయ్యం ఉందని.. అటువైపు వెళ్లడానికి కూడా తనకు భయమేస్తుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ న్యూస్‌ని బేస్ చేసుకునే ‘ఆవిరి కథను’ డెవలప్‌ చేసినట్లు రవిబాబు చెప్పాడు. కాగా.. ఆవిరి చిత్రం నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.