ఆది స్పోర్ట్స్ డ్రామాకు ‘క్లాప్‌’

వైవిధ్య పాత్రలలో నటిస్తూ ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఆది పినిశెట్టి.. ద్విభాషా చిత్రంలో నటించబోతున్నాడు. కొత్త దర్శకుడు పృథ్వీ అదిత్య దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రానికి క్లాప్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఇవాళ జరిగింది. ఈ సందర్భంగా తమిళ వెర్షన్‌కు ఇళయరాజా, తెలుగు వెర్షన్‌కు నాని క్లాప్ కొట్టగా.. నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. బోయపాటి శీను, గోపిచంద్ మలినేని, బొమ్మరిల్లు […]

ఆది స్పోర్ట్స్ డ్రామాకు ‘క్లాప్‌’
TV9 Telugu Digital Desk

| Edited By:

Jun 12, 2019 | 12:10 PM

వైవిధ్య పాత్రలలో నటిస్తూ ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఆది పినిశెట్టి.. ద్విభాషా చిత్రంలో నటించబోతున్నాడు. కొత్త దర్శకుడు పృథ్వీ అదిత్య దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రానికి క్లాప్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఇవాళ జరిగింది. ఈ సందర్భంగా తమిళ వెర్షన్‌కు ఇళయరాజా, తెలుగు వెర్షన్‌కు నాని క్లాప్ కొట్టగా.. నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. బోయపాటి శీను, గోపిచంద్ మలినేని, బొమ్మరిల్లు భాస్కర్‌లు.. దర్శకుడికి స్క్రిప్ట్ అందరజేశారు. కాగా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో ఆది సరసన మళ్లీ రావా ఫేమ్ ఆకాంక్ష సింగ్ నటిస్తుంది. బిగ్ ఫ్రింట్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu