అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న టీఎంసీ, బీజేపీ.. పోటా పోటీ ప్రచారంతో హోరెత్తుతున్న పశ్చిమ బెంగాల్..!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి అతి త్వరలో ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్ రాకముందే అక్కడ రాజకీయాలు వేడేక్కాయి.
West Bengal Elections 2021: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి అతి త్వరలో ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్ రాకముందే అక్కడ రాజకీయాలు వేడేక్కాయి. ముఖ్యంగా అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ, భారతీయ జనతా పార్టీ మధ్య గత కొంత కాలంగా మాటలయుద్ధం నడుస్తోంది. టీఎంసీ నుంచి పలువురు కీలక నేతలు బీజేపీలో చేరారు. వీరిలో మంత్రులు, ఎంపీలు ఉన్నారు. బెంగాల్‌లో ఈసారి బీజేపీ విజయబావుటా ఎగరవేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. మరోవైపు ఈ సారి టీఎంసీని ధీటుగా ఎదురుకునే సత్తా బీజేపీ ఉందని అత్యధికులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బెంగాల్‌లో పాగా వేసేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకుంటూ దీదీ సర్కార్‌ను ఇరుకున్న పేట్టే ప్రయత్నాలు చేస్తోంది కమల దళం. త్వరలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. కేరళలో బీజేపీ అధికారం చేజిక్కించుకునే అవకాశం లేదు. తమిళనాడులో డీఎంకేదే అధికారమని సర్వేలు చెబుతున్నాయి. ఇలాంటి తరుణంలో పశ్చిమ బెంగాల్‌పైనే బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ బెంగాల్ ఎన్నికల ఇన్‌చార్జిగా ఆరుగురు కేంద్ర మంత్రులను నియమింది. గెలుపు బాధ్యతను వారిపై పెట్టింది. బెంగాల్‌లో బీజేపీ అధ్యక్షుడు జేపీనడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా పర్యటించారు. దీంతో బెంగాల్ రాజకీయ ఒక్కసారిగా పొలిటికల్ వేడేక్కింది.
మరోవైపు పార్టీ అసంతృప్తులను చేరదీస్తూ వలసలు, పక్కా వ్యూహాలతో టీఎంసీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది బీజేపీ. బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే, మమతా బెనర్జికి ఈ ఎన్నికలు అసలైన సవాల్ మారాయి. ఏడాది ముందు నుంచే ఎన్నికల రంగంలోకి దిగిన కమలదళం. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. వ్యూహా చత్తురతతో ప్రత్యర్థులను దెబ్బతిసే మమతను ఎదుక్కొవడం అంత ఈజీ కాదని భావించిన కమల దళం. దీదీకి దీటుగా రాజకీయ ఎత్తులు వేస్తోంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను వెలికి తీస్తూ ప్రజల ముందుకు తీసుకెళ్తోంది. ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా జారవిడుచుకోకుండా మమతను ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది బీజేపీ.
ఇప్పటికే టీఎంసీలోని బలమైన నేతలను ఆకర్షించి బీజేపీ పైచేయి సాధించింది. దీదీ కేబినెట్‌లోని మంత్రులు సైతం దీదీని వదిలి బీజేపీ తీర్థం పుచ్చుకోవడం టీఎంసీకీ మిగుడుపడటంలేదు. గత లోక్‌సభ ఎన్నికల వరకూ కనీస ప్రభావం చూపని బీజేపీ. 2019 లోక్ సభ ఎన్నికల్లో తన మార్క్‌ని స్పష్టంగా చూపింది. ఎవరూ ఊహించిన రీతిలో 18 పార్లమెంట్ స్థానాల్లో విజయఢంకా పూరించింది. ఇక, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమదే అధికారం అంటూ కమల దళం ధీమా వ్యక్తం చేస్తోంది.
అయితే, ప్రస్తుత తరుణంలో సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన దీదీ ఎలా వ్యవహరిస్తారన్నదీ సర్వత్రా ఆసక్తి నెలకొంది. మమత అనుసరించే వూహ్యాలు ఆమె రాజకీయ భవిష్యత్‌పై ఆధారపడనున్నాయని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. కాంగ్రెస్,వామపక్ష కూటమి ఒక వైపు, బీజేపీ మరో వైపు మమతకు సవాల్ విసురుతున్నాయి. బెంగాల్‌లో తిరుగలేని శక్తిగా ఎదిగిన మమతాకు ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలు సంక్లిష్టంగా మారాయని విశ్లేషకులు భావిస్తున్నారు. జంగల్ మాల్ పరిధిలో అత్యధిక స్థానాలు గెలుచుకుని టీఎంసీకి అక్కడి ఎస్సీ, ఎస్టీ వర్గాలు దూరం కావడం మమతను కలవరపెట్టిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్‌పై దీదీ ఆశలు పెట్టుకుంది. బెంగాల్‌లో బీజేపీని కట్టడి చేసేందుకు దీదీకి సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
ఇప్పటికే టీఎంసీ, బీజేపీల మధ్య మాటల తూటలు, దాడులు జరిగాయి. అటూ కాంగ్రెస్ నాయకులు ప్రియాంక గాంధీ బెంగాల్ ఎన్నికల ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. జోరుగా ప్రచారం సాగిస్తూ టీఎంసీ, బీజేపీనే టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే పలు సంస్థలు సర్వే నిర్వహించాయి. కొన్ని సంస్థలు బీజేపీకి అనుకూలంగా నివేదికలు ఇస్తే, మరికొన్ని మళ్లీ దీదీనే అధికారంలోకి రావడం ఖాయం అంటున్నాయి. అయితే బెంగాల్‌లో రోజురోజూకు పరిణామాలు సర్వే అంచనాలను మార్చే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇదీ చదవండిః బెంగాల్‌లో హీటెక్కుతున్న ఎలక్షన్ పాలిటిక్స్.. పోటాపోటీగా సెలబ్రిటీలకు గాలం వేస్తున్న ప్రధాన పార్టీలు..