బెంగాల్‌లో హీటెక్కుతున్న ఎలక్షన్‌ పాలిటిక్స్‌.. పోటాపోటీగా సెలబ్రిటీలకు గాలం వేస్తున్న ప్రధాన పార్టీలు..

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలైంది. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో..

బెంగాల్‌లో హీటెక్కుతున్న ఎలక్షన్‌ పాలిటిక్స్‌.. పోటాపోటీగా సెలబ్రిటీలకు గాలం వేస్తున్న ప్రధాన పార్టీలు..
Follow us
K Sammaiah

|

Updated on: Feb 25, 2021 | 12:34 PM

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలైంది. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారంలో స్పీడ్‌ పెంచాయి. అధికార పార్టీ టీఎంసీ, బీజేపీ పార్టీలు హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నాయి. నేతల జంపింగ్‌లు.. సెలబ్రిటీల చేరికలతో.. బెంగాల్ రాజకీయాలు రోజు రోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్లు మనోజ్ తివారి, అశోక్ దిండా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మనోజ్ తివారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరగా.. అశోక్ దిండా బీజేపీ కండువా కప్పుకున్నారు. తాజాగా ప్రముఖ బెంగాలీ నటి పాయెల్ సర్కార్ బీజేపీలో చేరారు. కోల్‌కతాలో జరిగిన బీజేపీ ప్రచార సభ వేదికగా.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సమక్షంలో ఆమె కమలం కండువా కప్పుకున్నారు.

పాయెల్ సర్కార్ బెంగాలీతో పాటు హిందీ భాషలోనూ సినిమాలు చేశారు. ఇప్పటి వరకు దాదాపు 40 సినిమాల్లో నటించారు. టీవీ సీరియళ్లలోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. బెంగాల్ రాజకీయాల్లో సినీ నటులు చాలా మంది ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికలు పలువురు నటులు టీఎంసీ తరపున బరిలోకి దిగి ఎంపీలుగా గెలిచారు. మిమీ చక్రవర్తి, నుస్రత్ జహాన్ ప్రస్తుతం పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు.

Read more:

ఆ షాప్‌లకు 100 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు.. హామీ నిలబెట్టుకునేందుకు టీ సర్కార్‌ కసరత్తు