back to homepage
5 state election 2021

ముకుల్ రాయ్-కృష్ణానగర్‌ ఉత్తర్‌ అసెంబ్లీ సీట్లు 2021 (పశ్చిమ బెంగాల్ ఎన్నికలు)

కేంద్ర మాజీ మంత్రి అయిన ముకుల్ రాయ్ ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అంతకుముందు టీఎంసీలో కీలక నాయకుడిగా ఉన్న ఆయన పార్టీని వీడి బీజేపీలో చేరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో టీఎంసీ 2017 లో ముకుల్ రాయ్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. అనంతరం ఆయన బీజేపీలో చేరారు. ముకుల్ రాయ్ 2006 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా కూడా పనిచేశారు. యూత్‌ కాంగ్రెస్‌తో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రాయ్‌.. టీఎంసీలో కీలక నేతగా ఎదిగారు. 66 ఏళ్ల ముకుల్ రాయ్ టిఎంసీ టికెట్‌పై 2001 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి. నాడియా జిల్లాలోని కృష్ణానగర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఇక్కడ టీఎంసీ నుంచి కౌశాని ముఖర్జీ పోటీ చేస్తున్నారు. కౌశాని బెంగాలీ నటి. ముకుల్ రాయ్ కుమారుడు శుభ్రాన్షు రాయ్ కూడా 2019లో బిజెపిలో చేరారు. పార్టీ అతన్ని బీజ్‌పూర్ అసెంబ్లీ నుంచి పోటీలో దింపింది.