Tamil Nadu Elections: నేటి సాయంత్రంతో మూగబోనున్న మైకులు.. ముగిసిన ఎన్నికల ప్రచారం.. 6న పోలింగ్‌

Tamil Nadu Assembly Elections: దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఆదివారం..

Tamil Nadu Elections: నేటి సాయంత్రంతో మూగబోనున్న మైకులు.. ముగిసిన ఎన్నికల ప్రచారం.. 6న పోలింగ్‌
Tamil Nadu Elections
Follow us

|

Updated on: Apr 04, 2021 | 8:42 AM

Tamil Nadu Assembly Elections: దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఆదివారం సాయంత్రం 7 గంటలతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ప్రచారంలో భాగంగా హోరెత్తిన మైకులు మూగబోనున్నాయి. ఈ నెల 6న పోలింగ్‌ జరగనుంది. ఒకే విడతలో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. పోలింగ్‌కు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల కోసం మొత్తం 1,55,102 ఈవీఎంలను వినియోగిస్తున్నారు. 80 ఏళ్ల పైబడిన వారికి పోస్టల్‌ ఓట్లు వేసేలా అధికారులు అవకాశం కల్పించారు. దీని కోసం 2.44 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫలితాలు మే 2న వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. అయితే పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేందుకు ఇప్పటికే అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎన్నికల బరిలో ఉన్నాడీఎంకే, డీఎంకే, కమల్‌హాసన్‌, దినకరన్‌ పార్టీలతో పాటు పలు రాజకీయ పక్షాలు బరిలో ఉన్నాయి. అయితే అన్నాడీఎంకే, డీఎంకే కూటముల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. ఇరు పక్షాలకు చెందిన రాష్ట్ర జాతీయ పార్టీ అగ్రనేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌షా, రాహుల్‌ గాంధీ ఇతర కూటముల పక్షాన ప్రచారం నిర్వహించారు.

మొత్తం 234 సీట్లు

తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గడువు మే 24వ తేదీతో ముగియనుంది. ఈ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే కూటమిలో బీజేపీ తదితర పక్షాలు ఉండగా, డీఎంకే నేతృత్వంలోని కూటమిలో కాంగ్రెస్‌, మరికొన్ని పార్టీలు ఉన్నాయి. ఇక జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు చెరో 25 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.

ఇవీ చదవండి: Konda Vishweshwar Reddy: తెలంగాణలో మరో కొత్త పార్టీ అవసరం… చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

Tamil Nadu Elections 2021: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఎఫెక్ట్.. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖుష్బుపై కేసు నమోదు..

West Bengal: ఊపందుకున్న బెంగాల్‌ ఎన్నికల ప్రచారం.. మార్కెట్లో హల్‌చల్‌ చేస్తోన్న మోదీ, మమతా స్వీట్‌ విగ్రహాలు

వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌