Kamal Akshara, Suhasini dance : సుహాసిని, కమల్ కూతురు అక్షర రోడ్లపై డ్యాన్సులు, తమిళనాట పీక్స్‌కు చేరిన ప్రచారం

Kamal's daughter Akshara, niece Suhasini dance : తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కాసేపట్లో ముగుస్తున్న వేళ ప్రచారం పీక్స్ కు చేరుతోంది. ప్రధాన పార్టీల నేతలు, అభ్యర్థులు తమిళనాట వివిధ ప్రాంతాల్లో..

Kamal Akshara, Suhasini dance :  సుహాసిని, కమల్ కూతురు అక్షర రోడ్లపై డ్యాన్సులు, తమిళనాట పీక్స్‌కు చేరిన ప్రచారం
Suhashini
Follow us

|

Updated on: Apr 04, 2021 | 4:06 PM

Kamal’s daughter Akshara, niece Suhasini dance : తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కాసేపట్లో ముగుస్తున్న వేళ ప్రచారం పీక్స్ కు చేరుతోంది. ప్రధాన పార్టీల నేతలు, అభ్యర్థులు తమిళనాట వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను ఆకర్షించడానికి పడలేని పాట్లు పడుతున్నారు. అభ్యర్థులకు మద్దతుగా పలువురు రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన వారు కూడా ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. తమ వారిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. కమల్‌హాసన్‌ మక్కల్‌ నీది మయ్యం పార్టీ తరపున నటి సుహాసినితో పాటు కమల్ కూతురు అక్షర కూడా ప్రచారంలో పాల్గొన్నారు. టార్చ్‌లైట్‌ గుర్తును చూపిస్తూ కమల్‌ పార్టీని గెలిపించాలని డాన్స్‌ చేశారు. చెన్నైతో పాటు కోయంబత్తూరులో కూడా వీళ్లిద్దరు ప్రచారం చేశారు.

అక్షరతో పాటు సుహాసిని కూడా అదిరేటి స్టెప్పులు వేశారు. తన బాబాయ్‌ను గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు సుహాసిని. కాగా, తమిళనాడులో ఏప్రిల్ 6 వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు శాయశక్తుల కృషి చేస్తున్నాయి. అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పొత్తు కుదరగా…డీఎంకే, కాంగ్రెస్ మధ్య పొత్తులు కుదిరాయి. మూడవ కూటమి ఏర్పడిన మక్కల్ నీది మయ్యం, సమత్తువ మక్కల్ కట్చి, జననాయగ కట్చిలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఐజేకే కూటమి సీఎం అభ్యర్థిగా కమల్ హాసన్ ఉన్నారు.

Read also :Perni nani on Pawan : పవన్ ఓ అద్దె మైకులా తయారయ్యారు.. తిరుపతి ప్రచారంపై వైసీపీ మంత్రుల ముప్పేటదాడి