Perni nani on Pawan : పవన్ ఓ అద్దె మైకులా తయారయ్యారు.. తిరుపతి ప్రచారంపై వైసీపీ మంత్రుల ముప్పేటదాడి

Venkata Narayana

Venkata Narayana |

Updated on: Apr 04, 2021 | 3:41 PM

AP Ministers Perni Nani, Kodali nani, Dharmana krishna das slams janasena chief pawan kalyan : తిరుపతిలో పవన్ కల్యాణ్‌ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది...

Perni nani on Pawan : పవన్ ఓ అద్దె మైకులా తయారయ్యారు..  తిరుపతి ప్రచారంపై వైసీపీ మంత్రుల ముప్పేటదాడి
జనసేనాని తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం...
Follow us

AP Ministers Perni Nani, Kodali nani, Dharmana krishna das slams janasena chief pawan kalyan : తిరుపతిలో పవన్ కళ్యాణ్‌ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. పవన్ ఓ అద్దె మైకులా తయారయ్యాని మంత్రి పేర్నినాని అన్నారు. పవన్ తిరుపతి ప్రసంగం విన్న తర్వాత ఆయన అజ్ఞాతవాసి కాదు… అజ్ఞానవాసి అని నిరూపణైందన్నారు పేర్ని. పవన్ కల్యాణ్‌కి సినిమాల్లో నటించడం రాదని…రియల్‌ లైఫ్‌లో మాత్రం బాగా నటిస్తారని ఆయన్ని మించిన నటుడు మరొకరు లేరన్నారు మంత్రి పేర్ని నాని.

సినిమాల్లో ఫైట్లు చేసినట్లుగా రియల్‌ లైఫ్‌లోనూ చేద్దామనుకుంటే కుదరదని పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కౌంటర్ ఇచ్చారు. సినిమాల్లో మాదిరి ఏది పడితే అది మాట్లాడి రాజకీయాల్లో రానించాలనుకోవడం పవన్ కళ్యాణ్ అవివేకమన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిని చట్టప్రకారం శిక్షించేందుకే దర్యాప్తుకు ఆదేశించామన్నారు. సినిమాల్లో 20 మందిని ఒంటి చేత్తో కొట్టినా.. తన ముందు పవన్ బలాదూర్ అంటూ కొట్టి పారేశారాయన. దమ్ముంటే ఎన్నికల్లో పవన్ సత్తా చాటాలని సవాల్ విసిరారు ధర్మాన.

ఇక రాజకీయాల్ని కూడా సినిమా వ్యాపారంగా మార్చేశారని పవన్ కళ్యాణ్ మీద మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. పాచిపోయిన లడ్డూలిచ్చారని గతంలో బీజేపీపై దుమ్మెత్తిపోసిన పవన్ ఇప్పుడెందుకు వారికి ఓటేయమని అడుగుతున్నారని భూమన నిలదీశారు.

Read also : ధర్మ యుద్ధంలో గెలువలేరంటూ జగన్ పై చింతా హాట్ కామెంట్స్, డబ్బెక్కడిది..? సునీత ఆక్రోశానికి కారణమేంటని సూటి ప్రశ్నలు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu