AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధర్మ యుద్ధంలో గెలువలేరంటూ జగన్ పై చింతా హాట్ కామెంట్స్, డబ్బెక్కడిది..? సునీత ఆక్రోశానికి కారణమేంటని సూటి ప్రశ్నలు

Chinta mohan : తిరుపతి పార్లమెంట్ నియోజయవర్గ బై పోల్‌ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ చింతామోహన్ జోరు పెంచారు. వాళ్లనీ వీళ్లనీ కాదు.. డైరెక్ట్‌గా సీఎం జగన్‌నే టార్గెట్ చేశారు. కుటుంబానికి..

ధర్మ యుద్ధంలో గెలువలేరంటూ జగన్ పై చింతా హాట్ కామెంట్స్, డబ్బెక్కడిది..? సునీత ఆక్రోశానికి కారణమేంటని సూటి ప్రశ్నలు
Ex Mp Chinta Mohan Sensational Comments
Venkata Narayana
|

Updated on: Apr 04, 2021 | 2:08 PM

Share

Chinta mohan : తిరుపతి పార్లమెంట్ నియోజయవర్గ బై పోల్‌ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ చింతామోహన్ జోరు పెంచారు. వాళ్లనీ వీళ్లనీ కాదు.. డైరెక్ట్‌గా సీఎం జగన్‌నే టార్గెట్ చేశారు. కుటుంబానికి న్యాయం చేయని వాళ్లు రాష్ట్రానికేం మేలు చేస్తారని ఆరోపణాస్త్రాలు సంధించారాయన. జగన్ చెల్లెలు షర్మిళ.. చిన్నాన్న కూతురు సునీతా ఎందుకు ఆక్రోషిస్తున్నారో చెప్పాలంటూ చింతా మెహన్ ఏపీ సీఎం జగన్ ను ప్రశ్నించారు. తిరుపతిలో ధర్మయుద్ధం అంటూ జరిగితే గెలిచేది కాంగ్రెస్సేనని జోస్యం చెప్పారు చింతా. అంతేనా, మరో ఆరు నెలలే జగన్ సీఎంగా ఉంటారంటూ మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి రెండేళ్లయినా ఎందుకు కేసు ముందుకు సాగడం లేదని చింతా మోహన్ ప్రశ్నించారు. ఈ హత్యకు బాధ్యత ఎవరిది? తన చిన్నాన్న హత్యపై సీఎం జగన్‌ నోరు విప్పాలని చింతా డిమాండ్ చేశారు. సొంత సోదరి.. వివేకా కూతురు మాటలకు జగన్‌ 24 గంటల్లోగా సమాధానం చెప్పకపోతే ఆయనను అనుమానించాల్సి వస్తుందంటూ తీవ్రమైన సందేహాలకు తెరలేపారు. ధర్మయుద్ధంలో జగన్‌ గెలవలేరన్న ఆయన, గతంలో కాంగ్రెస్‌కు పట్టిన గతే ఈసారి బీజేపీ కూడా పడుతుందని చెప్పుకొచ్చారు.

అధిక ధరలు దాని పతనానికి ప్రధాన హేతువని ఆయన పేర్కొన్నారు. బీజేపీ తరఫున జనసేన అధ్యక్షుడు పవన్‌ చేస్తున్న ప్రచారం వల్ల ప్రయోజనమేమీ ఉండదని, అదంతా వృథా ప్రయాస అని చింతా మోహన్ వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గురుమూర్తి నామినేషన్‌ సందర్భంగా ఆ పార్టీ కోటి రూపాయలు ఖర్చుచేసిందని.. ఈ డబ్బంతా ఎక్కడిదని ఆయన వైసీపీని ప్రశ్నించారు.

Read also : U ఆకారంలో అటాక్, 600 మందికి పైగా మావోలు.. 100 మీటర్ల నుంచి కాల్పులు, ఐఈడీలు, రాకెట్‌ లాంచర్లు, ఏకే 47లతో మెరుపు దాడి

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!