prashant kishor: ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం… ఇకపై ఎన్నికల వ్యూహకర్తగా కొనసాగబోవడంలేదని స్పష్టం

దేశ వ్యాప్తంగా ఎన్నికల్లో ఎలా గెలవాలో పార్టీలకు సలహాలు, సూచనలు ఇస్తూ సరికొత్త ట్రెండ్ సృష్టించిన ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

prashant kishor: ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం...  ఇకపై ఎన్నికల వ్యూహకర్తగా కొనసాగబోవడంలేదని స్పష్టం
Prashant Kishor
Follow us
Ram Naramaneni

|

Updated on: May 02, 2021 | 5:10 PM

దేశ వ్యాప్తంగా ఎన్నికల్లో ఎలా గెలవాలో పార్టీలకు సలహాలు, సూచనలు ఇస్తూ సరికొత్త ట్రెండ్ సృష్టించిన ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను ఎన్నికల వ్యూహకర్తగా కొనసాగబోవడంలేదని స్పష్టం చేశారు. జీవితంలో మరేదైనా చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీఎంసీ, డీఎంకేల కోసం పనిచేశారు. ఈ రెండు పార్టీలు విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే.. ఎన్నికల వ్యూహకర్త‌ బాధ్యతల నుంచి వైదొలిగి.. వేరే పనే చూసుకుంటానని ప్రశాంత్ కిశోర్ సవాల్ విసిరారు. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని.. మమతా బెనర్జీ సీఎం అవుతారని ఘంటాపథంగా చెప్పారు. అంతేకాదు, బెంగాల్లో బీజేపీ వంద కంటే ఎక్కువ సీట్లు గెలిచినా.. తాను అస్త్ర సన్యాసం చేస్తానని పీకే శపథం చేశారు. ఐప్యాక్‌ను వదిలిపెడతానని.. ఎన్నికల వ్యూహకర్తగా పని చేయబోనన్నారు.

ప్రస్తుతం చేస్తున్న పనిని ఇకపై కొనసాగించలేనని ప్రశాంత్ కిశోర్ తాజాగా వెల్లడించారు. బెంగాల్ లో టీఎంసీ గెలిచిందని, అందుకు తాను ఎంత చేయాలో అంతా చేశానని వివరించారు. కొంతకాలం విరామం తీసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. అయితే గతంలో తాను కూడా రాజకీయాల్లోకి వచ్చినా, విఫలం అయ్యానని వెల్లడించారు. బెంగాల్ లో 8 విడతల్లో ఎన్నికలు జరగ్గా…. బీజేపీకి రెండంకెల సీట్లు దాటితే తాను ట్విట్టర్ నుంచి తప్పుకుంటానని ప్రశాంత్ కిశోర్ పదేపదే సవాల్ చేశారు. ఆయన సవాల్ కు తగ్గట్టుగానే బీజేపీకి ప్రస్తుతం బెంగాల్ ఓట్ల లెక్కింపులో  రెండంకెలకు మించి సీట్లు రాలేదు.

తృణమూల్ కాంగ్రెస్ తనంతట తానుగా కుప్పకూలితేనే బీజేపీకి బెంగాల్‌లో అవకాశం ఉంటుందని ప్రశాంత్ కిశోర్ గ‌తంలో పేర్కొన్నారు. బీజేపీ వ్యూహంలో భాగంగానే టీఎంసీ నేతలు కమలం గూటికి చేరుతున్నారని, డబ్బు, పదవులు, టికెట్లు ఆఫర్ చేసి టీఎంసీ నేతలను బీజేపీ తనవైపు తిప్పుకుందని పీకే ఆరోపించారు. బెంగాల్‌లో 200 సీట్లు గెలుస్తామని బీజేపీ, అమిత్ షాలు పదే పదే చెబుతూ వచ్చారు. ఫలితాల్లో మాత్రం వారి అంచనాలు తల్లకిందులయ్యాయి,

Also Read: నాగార్జున సాగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం..

తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలు.. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఘ‌న‌విజయం