ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆనాడు ఏమన్నారంటే ! అదే నిజం కాబోతోంది.. కానీ ..?

బెంగాల్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆ మధ్య చేసిన ట్వీట్ ని ఈ ఎన్నికల ఫలితాల సందర్భంగాగుర్తుంచుకోవాల్సి  ఉంటుంది. ఇండియాలో ప్రజాస్వామ్యానికి ఈ  సూచికలని,,,

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆనాడు ఏమన్నారంటే ! అదే నిజం కాబోతోంది.. కానీ ..?
Election Strategist Prashant Kishor
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: May 02, 2021 | 1:27 PM

బెంగాల్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆ మధ్య చేసిన ట్వీట్ ని ఈ ఎన్నికల ఫలితాల సందర్భంగాగుర్తుంచుకోవాల్సి  ఉంటుంది. ఇండియాలో ప్రజాస్వామ్యానికి ఈ  సూచికలని,   బెంగాల్ ప్రజలు ‘రైట్ కార్డు’ ను చూపాలనే నిర్ణయించుకున్నారని ఆయన  అన్నారు. బెంగాల్ కి తన కుమార్తె (మమతా బెనర్జీ) మాత్రమే అవసరమని మే 2 న తన చివరి ట్వీట్ ను చూడడానికి సిద్ధంగా ఉండాలని ఆయన గత ఫిబ్రవరి 27 న ట్వీట్ చేశారు. బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి  రాకుండా చూసేందుకు ప్రశాంత్ కిషోర్ తన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ టీమ్ తో ఓ వ్యూహాన్ని రూపొందించారు. ఆ వ్యూహం ఫలించి బెంగాల్ లో మళ్ళీ దీదీ నేతృత్వంలోని టీఎంసీ ..అత్యధిక సీట్లలో లీడింగ్ లో ఉంది. ఇక  మూడో సారి పవర్  దిశగా పరుగులు తీస్తోంది. కానీ నందిగ్రామ్ లో బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి చేతిలో మమతా బెనర్జీ ఓటమి దిశగా పయనిస్తున్న సూచనలు మాత్రం ఈ టీమ్ కి అంతుబట్టడంలేదు.  ఏమైనా… ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా వంటి బీజేపీ హేమాహేమీల  ప్రచారాలను ప్రశాంత్ కిషోర్ తిప్పికొట్టగలిగారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీదే విజయమని, 200 సీట్లకు పైగా గెలుస్తామని, తమ రోడ్ షోలు, ఎన్నికల ర్యాలీల్లో వీరు ధీమా వ్యక్తం చేశారు.  2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తాము 18 సీట్లను గెలుచుకున్నామని , ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే పంథా సాధిస్తామని బీజేపీ నేతలు పేర్కొంటూ వచ్చారు. కానీ బెంగాల్  ఓటర్ల తీరు  మరోలా ఉంది. మమత పార్టీకే వారు జై కొట్టారు. బీజేపీ అనేకమంది సినీ, టీవీ స్టార్స్ ని తమ స్టార్ కాంపెయినర్లుగా  రంగంలోకి దింపింది.  సీనియర్  బెంగాలీ, బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి సేవలను  కూడా ఉపయోగించుకుంది.. తన బెంగాలీ సినిమాల్లోని డైలాగులను మిథున్ వల్లించినా ఓటర్లు కొట్టి పారేశారు. అయితే నందిగ్రామ్ లో సువెందు అధికారి తరఫున మిథున్ చేసిన ప్రచారం మాత్రం ఫలితం ఇచ్చినట్టు  కనిపిస్తోంది.

ఎన్నికల ముందు పొలోమంటూ అనేకమంది తృణమూల్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. కానీ దీదీ ఏ మాత్రం ఆందోళన చెందలేదు. కేంద్రం  మీద, ప్రధాని మోదీ మీద తన విమర్శనాస్త్రాలను ఆమె ఎక్కుపెడుతూనే వచ్చింది.