Bengal Elections: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పర్వంలో కీలక ఘట్టం. ఫలితాన్ని తేల్చేవి ఆ రెండు జిల్లాలే!
కీలక జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాలపై రాజకీయ విశ్లేషణలు జోరందుకున్నాయి. ప్రత్యర్థి రాజకీయ పార్టీల కోటలను బద్దలు కొట్టి ఎలాగైనా విజయం సాధించాలని ప్రధాన రాజకీయ పార్టీలు యత్నాలను ముమ్మరం చేశాయి.
Bengal Elections interesting crucial phase ahead: బెంగాల్ అసెంబ్లీ (BENGAL ASSEMBLY) ఎన్నికల పర్వంలో తొలి అర్ధభాగం ముగిసింది. అంటే మొత్తం ఎనిమిది విడతలుగా జరుగుతున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పర్వం (BENGAL ASSEMBLY ELECTIONS 2021)లో తొలి నాలుగు విడతల పోలింగ్ ముగిసింది. మరో నాలుగు విడతల పోలింగ్ జరగాల్సి వుంది. ఏప్రిల్ 17వ తేదీన అయిదో విడత పోలింగ్‌కు ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలక జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాలపై రాజకీయ విశ్లేషణలు జోరందుకున్నాయి. ప్రత్యర్థి రాజకీయ పార్టీల కోటలను బద్దలు కొట్టి ఎలాగైనా విజయం సాధించాలని ప్రధాన రాజకీయ పార్టీలు యత్నాలను ముమ్మరం చేశాయి. ఎన్నికలు జరగాల్సి వున్న జిల్లాలను, నియోజకవర్గాలను పరిశీలిస్తే.. నార్త్ 24 పరగణాలు (NORTH 24 PARAGA), సౌత్ 24 పరగణాలు (SOUTH 24 PARAGANA) జిల్లాలపై బీజేపీ (BJP) ప్రధానంగా ఫోకస్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ రెండు జిల్లాలు తృణమూల్ కాంగ్రెస్ (TRINAMOOL CONGRESS)కు కంచుకోటలుగా భావిస్తారు. ఈ కోటలను బద్దలు కొట్టి టీఎంసీ (TMC) ఓటమికి బాటలు వేయాలనేది బీజేపీ ప్రణాళిక (BJP STRATEGY). ఈ రెండు జిల్లాల్లో మరోసారి అత్యధిక స్థానాలు గెలుపొందడం ద్వారా మరోసారి అధికారంలోకి రావాలని టీఎంసీ ఎత్తు వేసింది. మొత్తం 294 స్థానాల అసెంబ్లీలో ఈ రెండు జిల్లాల్లోనే 64 సీట్లు ఉన్నాయి. నార్త్ 24 పరగణలో 33, సౌత్ 24 పరగణలో 31 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సౌత్ 24 పరగణలో మైనారిటీల ప్రాబల్యం ఎక్కువ. ఈ రెండు జిల్లాలకు బంగ్లాదేశ్‌తో సరిహద్దులున్నాయి. దాంతో ఈ రెండు జిల్లాల్లో శరణార్థుల జనాభా కూడా ఎక్కువ.
1980లో 24 పరగణ జిల్లాను అప్పటి లెఫ్ట్ ప్రభుత్వం రెండు జిల్లాలుగా విభజించింది. మొదట్లో ఈ ప్రాంతంలో వామపక్షాలకు గట్టి పట్టు ఉన్నప్పటికీ క్రమంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. క్రమంగా వామపక్ష ప్రభావాన్ని తగ్గించేసింది మమతా బెనర్జీ (MAMTA BANERJEE). నందిగ్రామ్ (NANDIGRAM), సింగూర్ (SINGUR) ఉద్యమాలు ఈ ప్రాంతంలో టీంఎసీని మరింత బలోపేతం చేశాయి. 2011, 2016 ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో దాదాపు అన్ని స్థానాలను దీదీ పార్టీ గెల్చుకుంది. 2016లో నార్త్ పరగణలో 27, సౌత్ పరగణలో 29 స్థానాలను తృణమూల్ కాంగ్రెస్ గెల్చుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో నార్త్ పరగణలో బీజేపీ కొంతవరకు ప్రభావం చూపగలిగింది. కానీ బీజేపీ ప్రభావాన్ని మమతా బెనర్జీ అంగీకరించడం లేదు. బెదిరింపులతోను, ప్రలోభాలతోను 2019 ఎన్నికల్లో బీజేపీ కొంత ప్రభావం చూపిందని వాదిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత టీఎంసీ పుంజుకుందన్నది ఆ పార్టీ నేతల అభిప్రాయం. ఉభయ జిల్లాల్లోను టీఎంసీ బాగా పుంజుకుందని నార్త్ 24 పరగణ జిల్లా టీఎంసీ అధ్యక్షుడు జ్యోతిప్రియొ (JYOTI PRIO) ఘంటాపథంగా చెబుతున్నారు. పార్టీలో పెరుగుతున్న అంతర్గత విబేధాలు, మత ఘర్షణల కారణంగా రెండు జిల్లాల్లోనూ టీఎంసీ బలం కొంత తగ్గిందని రాజకీయ విశ్లేషకులు (POLITICAL ANALYSTS) అభిప్రాయపడుతున్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రచారాస్త్రంగా చేపట్టి, శరణార్ధులను ఆకర్షించి 2019 లోక్‌సభ ఎన్నికల్లో నార్త్ 24 పరగణ జిల్లాలో ఉన్న ఐదు స్థానాల్లో రెండింటిని బీజేపీ గెల్చుకోగలిగింది.
అలాగే, అక్కడ ప్రబలంగా ఉన్న మథువా (MATHUA) వర్గంలో భారతీయ జనతా పార్టీ (BHARATIYA JANATA PARTY)పట్టు సాధించింది. నార్త్ 24 పరగణలోని 14 అసెంబ్లీ స్థానాల్లో మథువాలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఈ రెండు జిల్లాల నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు సహా పెద్ద ఎత్తున పార్టీ నేతలు బీజేపీలో చేరడం టీఎంసీకి ఆందోళనకరంగా మారింది. కొత్తగా వచ్చి0న ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్‌ఎఫ్) సౌత్ 24 పరగణ జిల్లాలో టీఎంసీకి చెందిన మైనారిటీ ఓట్లను చీల్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఐఎస్‌ఎఫ్… కాంగ్రెస్ (CONGRESS), లెఫ్ట్ (LEFT FRONT)లతో కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ (PRIME MINISTER NARENDRA MODI), కేంద్ర హోం మంత్రి అమిత్ షా (UNION HOME MINISTER AMITH SHAH)ల ప్రచారం సాయంతో నార్త్ 24 పరగణలో 60% సీట్లను సాధిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ (DILIP GHOSH) ధీమాగా ఉన్నారు.
ALSO READ: సరిహద్దులో చైనా మరో కుట్ర.. టిబెట్ ఏరియాలో కొత్త ప్రాజెక్టుకు డ్రాగన్ శ్రీకారం
ALSO READ: మానవుని తొలి అంతరిక్ష యాత్రకు 60 ఏళ్ళు.. ఆ ఘనత సాధించిన మొదటి వ్యక్తి ఎవరో తెలుసా?