PM Modi Meet: వారణాసి బీజేపీ కార్యకర్తలతో ప్రధాని భేటీ.. గెలుపు మంత్రం బోధించిన మోడీ..!

ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా , ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం వారణాసి బీజేపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు .

PM Modi Meet: వారణాసి బీజేపీ కార్యకర్తలతో ప్రధాని భేటీ.. గెలుపు మంత్రం బోధించిన మోడీ..!
Follow us

|

Updated on: Jan 18, 2022 | 2:26 PM

PM Narendra Modi: ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా , ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం వారణాసి బీజేపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు . వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరిగింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ కార్యకర్తలకు ప్రధాని మోడీ దిశానిర్ధేశం చేశారు. యూపీలో పార్టీ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఆదేశించారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇది వర్చువల్ సమావేశమని బీజేపీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ శాఖ పేర్కొంది. ఇది మొత్తం ప్రోగ్రామ్ వివరాలను వివరించింది. NaMo యాప్ ద్వారా దీని కోసం వారి అభిప్రాయాలు, సూచనలను పంచుకోవాలని ప్రజలను కోరింది. నమో యాప్ ద్వారా బీజేపీ కార్యకర్తలతో సంభాషించిన సందర్భంగా ప్రధాని మోడీ, ‘సహజ వ్యవసాయాన్ని మనం ప్రోత్సహించాలి. రసాయన రహిత వ్యవసాయానికి రైతులను ప్రోత్సహించాలి. ఆజాదీ అమృత్ మహోత్సవ్ పండుగలో మనం అందరితో కలిసి పాల్గొనాలి.’ అని ప్రధాని మోడీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 10న 58 స్థానాల్లో తొలి దశ పోలింగ్‌ జరగనుంది. ఫిబ్రవరి 14న 55 స్థానాలకు రెండో దశ పోలింగ్‌ జరగనుంది. ఫిబ్రవరి 20న 59 స్థానాలకు మూడో దశ, ఫిబ్రవరి 23న నాలుగో దశ 60 స్థానాలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 27న ఐదో దశ 60 స్థానాలకు, ఆరో దశ 57 స్థానాల్లో మార్చి 3న, ఏడో దశ 54 స్థానాలకు మార్చి 7న జరగనుంది. మార్చి 10న ఓట్లను లెక్కిస్తారు.

Read Also….  Bhagwant Mann: హాస్యనటుడు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి దాకా.. భగవంత్ మాన్‌ ప్రస్థానం సాగింది ఇలా…