తమిళనాడు ఎన్నికల ప్రచారంలో కమల్ హాసన్ కు కోపమొచ్చింది.. చేతిలో ఉన్న పార్టీ గుర్తును విసిరికొట్టాడు..!
సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) అధినేత కమల్ హాసన్ కు కోపమొచ్చింది. ఎన్నికల ప్రచారంలో కమల్‌హాసన్‌కు ఆవేశంతో ఊగిపోయారు.
kamal haasan throws party symbol: సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) అధినేత కమల్ హాసన్ కు కోపమొచ్చింది. ఎన్నికల ప్రచారంలో కమల్‌హాసన్‌కు ఆవేశంతో ఊగిపోయారు. మైక్ పనిచేయడం లేదన్న కోపంతో తన పార్టీ ఎన్నికల గుర్తు చేతిలో ఉన్న టార్చ్ లైట్ ను అమాంతం విసిరికొట్టారు. కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. తన పార్టీ గుర్తును కమల్ విసిరిగొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. కరుణానిధి, జయలలిత మరణించిన తర్వాత..తొలి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈసారి ఎన్నికల బరిలో కమల్ హాసన్ నేతృత్వలోని మక్కల్ నీది మయ్యం కూడా పోటీ చేస్తోంది. ఈ పార్టీ చీఫ్ కమల్ హాసన్ దక్షిణ కోయంబత్తూరు నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇందులో భాగంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కమల్.. తన నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తున్నరు. కాన్వాయ్ లో వెళ్తూ.. ఓటర్లకు అభివాదం చేస్తున్నారు. ఈ క్రమంలో..మాట్లాడుతుండగా.. కమల్ చేతిలో ఉన్న మైక్రో ఫోన్ పని చేయలేదు. మాటలు విన బడకపోవడం కమల్ గమనించారు. వాహనంలో ఉన్న వారిని ఏమైందని అడిగారు. ఎంతకీ మైక్రో ఫోన్ పనిచేయకపోవడంతో.. తీవ్ర ఆగ్రహనికి గురయ్యారు. చేతిలో ఉన్న పార్టీ గుర్తు టార్చ్ లైట్ ను అమాంతం వాహనంలోకి విసిరికొట్టారు. దీనికి సంబంధించిన వీడియోను కొంతమంది సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో వీడియో వైరల్ గా మారింది. కమల్.. అంత కోపం వద్దూ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
When @ikamalhaasan lost his ‘cool’.. https://t.co/qikSALEJoN pic.twitter.com/SQHPbtdZlH
— Pramod Madhav♠️ (@PramodMadhav6) March 31, 2021
ఇదిలావుంటే, తమిళనాడులో 234 స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ 6వ తేదీన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది. కన్యాకుమారి ఎంపీ సీటు ఉప ఎన్నిక కూడా దీనితో పాటు జరగనుంది. ఈసారి ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిని ఎలాగైనా ఓడించాలని విపక్షాలు వ్యూహాలు పన్నుతున్నాయి.అయితే, తనతో పాటు మక్కల్ నీది మయ్యంలోని ప్రతి ఒక్కరం పారిశుధ్య కార్మికులం అని, రాజకీయాల్లోని మురికిని కడిగేందుకే రంగంలోకి దిగినట్టు పార్టీ నేత కమలహాసన్ తెలిపారు. మంగళవారం చెన్నై వేళచ్చేరిలో పోటీ చేస్తున్న మక్కల్ నీది మయ్యం అభ్యర్థి, ఐఏఎస్ సంతోష్‌బాబుకు మద్దతుగా రోడ్‌షోను కమల్ నిర్వహించారు. వేళచ్చేరి పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.
Read Also…
AP, Telangana Temperatures: తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో ముప్పు.. జాగ్రత్తగా ఉండాలంటున్న అధికారులు