Mamata Banerjee letter: ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ఐక్యమవుదాం.. బీజేపీయేతర నేతలకు మమతా బెనర్జీ లేఖ

బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్న వేళ.. బీజేపీయేతర నేతలకు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ రాసిన లేఖ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Mamata Banerjee letter: ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ఐక్యమవుదాం.. బీజేపీయేతర నేతలకు మమతా బెనర్జీ లేఖ
Mamata Banerjee Wrote Letter To Opposition Leaders
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 31, 2021 | 6:44 PM

Mamata Banerjee wrote letter: దేశ రాజకీయాలు కొత్త రూపు సంతరించుకుంటుందా..? ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లిందా? ఇప్పుడు సీన్ అదే అనిపిస్తుంది. భారతదేశాన్ని మొత్తం కాషాయమయం చేసేందుకు భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే కొత్త ఎత్తులు, వ్యుహాలతో అయా రాష్ట్రాల్లో ప్రాంతీయపార్టీల ఉనికి లేకుండా చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించిన భారతీయ జనతా పార్టీ గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.

ప్రస్తుత ఎన్నికలు జరగుతున్న రాష్ట్రాల్లో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్న వేళ.. బీజేపీయేతర నేతలకు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ రాసిన లేఖ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్థలను ఖూనీచేస్తోందని.. బీజేపీకి వ్యతిరేకంగా అందరం ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె పేర్కొన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటికే తొలి దశ ఎన్నికలు ముగిశాయి. గురువారం రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ, టీఎంసీ పార్టీలు పోటాపోటీ ప్రచారాలతో హీట్ పెంచాయి. ఇరు పార్టీల నేతలు పరస్పర విమర్శలు, ప్రతిదాడులతో బెంగాల్ రణరంగాన్ని తలపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీయేతర పార్టీలకు లేఖ రాయడం హాట్‌టాఫిక్‌గా మారింది. సోనియా గాంధీ తోసహా బీజేపీయేతర పార్టీల నేతలకు ఆమె కీలక విజ్ఞప్తి చేశారు. భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని.. బీజేపీకి వ్యతిరేకంగా మనమంతా ఏకమవ్వాల్సిన సమయం వచ్చిందని లేఖలో పేర్కొన్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సి వ్యూహంపై చర్చించేందుకు భేటీ అవుదామని ప్రతిపాదించారు మమతా బెనర్జీ.

”దేశ రాజధాని ప్రాంత సవరణ బిల్లు ద్వారా సీఎం నుంచి అధికారాలను బీజేపీ లాగేసుకుంది. లెఫ్టినెంట్ గవర్నర్‌ను అప్రకటిత వైస్రాయ్‌గా మార్చేసింది. బీజేపీయేతర పార్టీలను లక్ష్యంగా చేసుకొని.. రాజ్యాంగపరమైన హక్కులు, స్వేచ్ఛను కాలరాస్తోంది. రాష్ట్రాలకు ఉన్న అధికారాలను నిర్వీర్యం చేస్తోంది. సీబీఐ, ఈడీ వంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలను దర్వినియోగం చేస్తోంది. ధన బలంతో బీజేపీయేత ప్రభుత్వాలను కూల్చేందుకు కుట్రలు చేస్తోంది. దేశం ఆస్తులను మొత్తం ప్రైవేట్ సంస్థలకు అమ్ముకుంటోంది. రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య ఉన్న సంబంధాలను దెబ్బతీస్తోంది. మనమంతా ఏకమవ్వాల్సిన సమయం వచ్చింది. భారత ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థను ఖూనీ చేస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాటం చేయాలి. మీతో కలిసి పోరాటం చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నా.” అంటూ మమతా బెనర్జీ తన లేఖలో పేర్కొన్నారు.

Mamata Banerjee Wrote Letter

Mamata Banerjee Wrote Letter

మమతా బెనర్జీ లేఖ రాసిన వారిలో.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే అధినేత స్టాలిన్, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, సీపీఎంఎల్ నేత దిపాంకర్ భట్టాచార్య ఉన్నారు.

ఇదిలావుంటే, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో మొత్తం 8 దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగుతోంది. మొదటి దశ ఎన్నికల పోలింగ్ మార్చి 27న ముగిసింది. రెండో దశ ఎన్నికలు ఏప్రిల్ 1న జరగనుంది. మూడో దశ ఎన్నికలు ఏప్రిల్ 6, నాలుగో దశ ఎన్నికలు ఏప్రిల్ 10న, ఐదో దశ ఎన్నికలు ఏప్రిల్ 17న, ఆరో దశ ఎన్నికలు ఏప్రిల్ 22న, ఏడో దశ ఎన్నికలు ఏప్రిల్ 26న, ఎనిమిదో దశ ఎన్నికలు ఏప్రిల్ 29న జరగనున్నాయి. అసోంలో మూడు దశల్లో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాల ఫలితాలతో పాటే మే2న బెంగాల్, అసోం ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.

Read Also….  Kushboo: తమిళనాడులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం.. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న కుష్బూ .. ( ఫోటో గ్యాలరీ )

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!