తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్, ఖుష్బూ సుందర్ కి ఛాన్స్ ! జేపీ నడ్డాకు ధన్యవాదాలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తమ తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. గత ఏడాది కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన నటి, రాజకీయ నేత ఖుష్బూ సుందర్ ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్నారు.

తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్, ఖుష్బూ సుందర్ కి ఛాన్స్ ! జేపీ నడ్డాకు ధన్యవాదాలు
Actor Khushbu Sundar In Bjp's First List Of Candidates For Tamilnadu Elections
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Mar 14, 2021 | 6:48 PM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తమ తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. గత ఏడాది కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన నటి, రాజకీయ నేత ఖుష్బూ సుందర్ ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. ఈమె చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఇక్కడ డీఎంకేకి చెందిన డా.ఎజిలాన్ ను ఎదుర్కోనున్నారు. తనకు ఈ ఎన్నికల్లో టికెట్ ఇఛ్చి పోటీ చేసే అవకాశాన్ని  ఇచ్చినందుకు ఖుష్బూ…. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు, ప్రధాని మోదీకి ఇతరులకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. పార్టీ కోసం తాను శ్రమిస్తానని, గెలిచి తీరుతానని ఆమె అన్నారు. గత ఏడాది ఈమె కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపిన తన రాజీనామా లేఖలో..అసలు పార్టీతో ఎలాంటి సంబంధం లేనివారి కారణంగా తాను అణచివేతకు గురయ్యానని పేర్కొన్నారు. పార్టీలో ఉన్నత స్థానంలో ఉన్నవారికి ప్రజా సమస్యలతో సంబంధమే లేదని, పార్టీ కోసం కష్ట పడుతున్న తనలాంటి వారిని వారు శాసిస్తున్నారని ఖుష్బూ ఆరోపించారు.

ఇక ఈ వైఖరితో తను విసుగెత్తిపోయానన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరకముందు ఖుష్బూ డీఎంకేలో కొంతకాలం పాటు కొనసాగారు. కాగా… బీజేపీ అభ్యర్థులుగా  తమిళనాడు పార్టీ అధ్యక్షుడు మురుగన్ తరపురం నుంచి,  హెచ్.రాజా కరైకుడి నుంచి పోటీ చేస్తుండగా..వనతి శీనివాసన్ కోయంబత్తూర్ సౌత్ లో కమల్ హాసన్ ను ఎదుర్కోనున్నారు.  (వీరి పేర్లు ఈ మొదటి జాబితాలో ఉన్నాయి). నిన్న ప్రధాని మోదీ అధ్యక్షతన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై ఈ జాబితాను ఖరారు చేసింది. ఈ సమావేశంలో మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, పార్టీ అధ్యక్షుడు జేపీ.నడ్డా పాల్గొన్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ :  సింహం ప్రాంక్ వీడియో వైరల్.. నిజం తెలిసి నవ్వులే నవ్వులు..! Viral Video

పొట్టేలుతో సెల్ఫీ కోసం ట్రై చేసిన యువతికి మైండ్ బ్లాక్ షాక్ ఇచ్చింది వైరల్ గా మారిన వీడియో : Girl selfie

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?