Punjab Politics: పంజాబ్ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమే.. కీలక వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ

Punjab Politics: పంజాబ్ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమే.. కీలక వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ
Punjab Politics

Punjab Elections 2022: పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. పార్టీ కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ స్పష్టం చేశారు.

Balaraju Goud

|

Jan 02, 2022 | 12:09 PM

Punjab Assembly Elections 2022: పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మరోసారి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ తిరుగుబాటు ధోరణిని ప్రదర్శిస్తూ పంజాబ్ ఎన్నికలకు ముందే రాష్ట్రంలో కాబోయే సీఎంను ప్రకటించాలని డిమాండ్ చేశారు. వరుడు లేకుండా ఎలాంటి ఊరేగింపు ఉంటుంది. సీఎం పేరును ముందుగానే ప్రకటించాలని కోరుతున్నారు. పంజాబ్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ప్రకటించాలి. ఎవరు నాయకత్వం వహిస్తారో పంజాబ్ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. పంజాబ్‌లో ఎవరి రోడ్‌మ్యాప్ పని చేస్తుందో ఆ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలన్నారు. లేకుంటే ఈసారి మన పరిస్థితి తారుమారవుతుందని అన్నారు.

ఈ నేఫథ్యంలోనే పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ స్పందించారు. కాంగ్రెస్‌ పంజాబ్‌ యూనిట్‌ ప్రెసిడెంట్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూతో కలిసి పని చేసేందుకు, పార్టీ కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని శనివారం చెప్పారు. తనకు, సిద్ధూకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో చన్నీ ఈ ప్రకటన చేశాడు. సిద్ధూ తన సొంత పార్టీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉంటారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిద్ధూ చేసిన ప్రతికూల వ్యాఖ్యల గురించి అడిగిన ప్రశ్నకు, చన్నీ పార్టీకి నమ్మకమైన సైనికుడని, చాలా చిత్తశుద్ధితో తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారని చెప్పారు.

సిద్ధూ సాహబ్‌తో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను ఇప్పటికే చేస్తున్నాను. పార్టీ కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమే. పార్టీ ఏది చెబితే అది పాటిస్తానని చన్నీ అన్నారు. విమర్శలను ఎప్పుడూ స్వాగతిస్తాను. ఇది ఎక్కడి నుండైనా రావచ్చు. సిద్ధూ విమర్శించే ప్రయత్నం చేసినా, నేను అతని మాట విని సరిదిద్దుకుంటాను. అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, పంజాబ్‌లో జరిగే బహిరంగ సభల్లో సిద్ధూ ఎప్పుడూ సొంత పార్టీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం గమనార్హం.

ముఖ్యమంత్రి హామీ మేరకు తక్కువ ధరకు కేబుల్ టీవీ కనెక్షన్లు, ఇసుక ఇస్తున్నారా అని ర్యాలీలో సిద్ధూ ప్రజలను ప్రశ్నించారు. సిద్ధూ వ్యాఖ్యలపై చన్ని స్పందిస్తూ.. గనుల్లో క్యూబిక్ ఫీట్ కు రూ.5.50 చొప్పున ఇసుక పంపిణీ చేస్తున్నారని, కేబుల్ రంగం కేంద్రం అధీనంలో ఉందన్నారు. అలాగే సిద్ధూ మంత్రిగా ఉన్నప్పుడు కేబుల్ మాఫియాను అంతమొందించేందుకు కేబుల్ చట్టాన్ని ప్రతిపాదించారని, అయితే అది ఆ మేరకు నెరవేరలేదన్నారు. నవంబర్‌లో చన్నీ ప్రభుత్వం కేబుల్ టీవీకి నెలకు రూ.100 నిర్ణీత రుసుమును ప్రకటించింది.

ఇదిలావుంటే, బిక్రమ్ మజితియా కేసులో సిద్ధూ ప్రభుత్వాన్ని ప్రశ్నించగా.. నేరస్థుడిని పట్టుకోవడానికి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడమే తొలి అడుగు అని చన్నీ చెప్పారు. శిరోమణి అకాలీదళ్ నేతపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ రాకెట్‌పై దర్యాప్తు చేస్తున్న 2018 నివేదిక ఆధారంగా మజిథియాపై కేసు నమోదు చేసినట్లు చన్నీ తెలిపారు. అదే సమయంలో, ఎఫ్‌ఐఆర్‌పై సిద్ధూ ఎందుకు సంతృప్తి చెందలేదని ప్రశ్నించగా? చన్ని క్లుప్తంగా సమాధానం ఇచ్చారు. అకాలీ నేతపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం వల్ల ఏమీ చేయలేమని సిద్ధూ గతంలోనే చెప్పారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu