AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka Election 2023: మా నాన్న పూర్తి కాలం సీఎంగా ఉండివుంటే.. యడియూరప్ప కుమారుడి సంచలన వ్యాఖ్యలు

న్నో ప్రత్యేక పథకాలను తీసుకొచ్చారు. అందుకే నేటికీ ప్రజలు యడియూరప్పను గౌరవిస్తున్నారు. బహుశా యడియూరప్పా ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసి ఉంటే కర్నాటక ప్రజలు మరింత అభివృద్ధిని చూసి ఉండేవారు అని ఆయన కుమారుడు, బీజేపీ కర్నాటక ఉపాధ్యక్షుడు బీవై విజయేంద్ర అన్నారు.

Karnataka Election 2023: మా నాన్న పూర్తి కాలం సీఎంగా ఉండివుంటే.. యడియూరప్ప కుమారుడి సంచలన వ్యాఖ్యలు
BY Vijayendra
Sanjay Kasula
|

Updated on: Apr 07, 2023 | 3:35 PM

Share

కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది వారాల్లోనే ఎన్నికల ఉత్కంఠ నెలకొంది. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూకనకెరె యడియూరప్ప విజయేంద్ర న్యూస్9 ప్లస్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 80 ఏళ్ల వయస్సులో తన తండ్రి రాష్ట్ర అభివృ‌ద్ధి కోసం నిరంతం కృషి చేశారని గుర్తు చేశారు విజయేంద్ర. ఎలాంటి పక్షపాత వైఖరిని తావులేకుండా పాలన అందించారని అన్నారు. యడియూరప్ప కష్టపడి పని చేసే వ్యక్తి. యడియూరప్పా నిబద్ధతకు ప్రసిద్ధి చెందారన్నారు. యడియూరప్ప మాటల మనిషి కాదు.. చేతల మనిషి అని అన్నారు. కర్ణాటక ప్రజలు యడియూరప్పాజీని ఇలా గుర్తిస్తున్నారు.

తాను అధికారంలోకి వస్తానని యడియూరప్ప కలలో కూడా ఊహించలేదన్నారు. ఎమ్మెల్యే అవుతానని, మంత్రి అవుతానని కలలో కూడా అనుకోలేదు. తాను ఎల్లప్పుడూ ప్రజల ప్రయోజనాల కోసం పోరాడాడు. రైతుల సమస్యల కోసం నిత్యం పోరాడేవారు. ఎప్పుడూ పేద ప్రజల పక్షాన ఉండేవారు. ఇది ఐదు లేదా 10 సంవత్సరాలు కాదు. గత మూడు దశాబ్దాలుగా ఆయన సామాన్యుల సమస్యల కోసం నిరంతరం పోరాడారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంకా ముఖ్యంగా, బీజేపీని అంతకుముందు పట్టణ ఆధారిత పార్టీగా పిలిచేవారు. అయితే యడ్యూరప్ప కృషి వల్లనే పార్టీ కర్ణాటకలోని ప్రతి గ్రామానికి చేరుకోగలిగిందని అన్నారు బీవై విజయేంద్ర.

ఖచ్చితంగా. ఇంతకు ముందు బీజేపీని అగ్రవర్ణాల పార్టీగా పిలిచేవారు. ప్రజలు బీజేపీని ఎన్నడూ గుర్తించలేదు. కానీ యడియూరప్ప ఇతర సీనియర్ నాయకులు, మన గొప్ప నాయకుడు అనంత్ కుమార్ జీ , ఇతర సీనియర్ నాయకులు, రాష్ట్రం అంతటా పర్యటించినందున ప్రతి గ్రామం, కర్ణాటక ప్రజలు బీజేపీని గుర్తించగలిగారు.

ఈ అంశంపై యడియూరప్ప ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ, కర్నాటకపై ఆయనకు ఉన్న దార్శనికత కారణంగా ఆయన తన పదవీకాలాన్ని పూర్తి చేసి ఉండాల్సిన నాయకుడు అని అందరూ భావించారు. భాగ్యలక్ష్మి పథకం, పాఠశాల విద్యార్థులకు సైకిల్ పథకం, ఆయన హయాంలో ఎన్నో ప్రత్యేక పథకాలను తీసుకొచ్చారు. అందుకే నేటికీ ప్రజలు యడియూరప్పను గౌరవిస్తున్నారు. బహుశా యడియూరప్పా ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసి ఉంటే కర్నాటక ప్రజలు మరింత అభివృద్ధిని చూసి ఉండేవారు అని బీవై విజయేంద్ర అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం