Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Polls 2022: గుజరాత్‌లో కాంగ్రెస్ అగ్రనేత ప్రచారం.. మధ్యలో ఆగిపోయిన జోడో యాత్ర..

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ నెల మొదటి వారంలో రెండు విడతలుగా జరగనున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సోమవారం ఆ రాష్ట్రంలోని రెండు బహిరంగ సభల్లో..

Gujarat Polls 2022:  గుజరాత్‌లో కాంగ్రెస్ అగ్రనేత ప్రచారం.. మధ్యలో ఆగిపోయిన జోడో యాత్ర..
Rahul Gandhi
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Nov 22, 2022 | 6:48 AM

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ నెల మొదటి వారంలో రెండు విడతలుగా జరగనున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సోమవారం ఆ రాష్ట్రంలోని రెండు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. గుజరాత్ కాంగ్రెస్ నాయకుల తరఫున ఆయన ప్రచారం చేసేందుకు వీలుగా, ప్రస్తుతం మహారాష్ట్రలో సాగుతున్న భారత్ జోడో యాత్రకు కొంత విరామం ఇచ్చారు. సోమవారం రాజ్‌కోట్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘‘ప్రమాదం జరిగిన ప్రదేశంలోని వాచ్‌మెన్‌లను అరెస్టు చేసి జైలుకు పంపినప్పటికీ, నిజమైన నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. భాజపాతో సత్సంబంధాలు ఉన్నందున ఈ దుర్ఘటనకు మూల కారకులైన వారికి ఏమీ చేయడంలేదా? రైతులు తమ రుణాల సమస్యను కూడా పాలకుల దృష్టికి తీసుకువెళ్లారు. కానీ వారు ఏం పాపం చేశారని పట్టించుకోలేదు. దేశంలోని ముగ్గురు, నాలుగురు ధనవంతుల కోట్ల రూపాయల రుణాలను మాత్రం బీజేపీ ప్రభుత్వం మాఫీ చేసింది’’ అని ఆయన ఎద్దేవా చేశారు.

రైతులు రుణాలు తిరిగి ఇవ్వకపోతే డిఫాల్టర్లని, కోటీశ్వరులు అలా చేస్తే నిరర్థక ఆస్తులు అంటారని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. రైతులు ప్రధానమంత్రి బీమా యోజనలో పెట్టుబడి పెడుతున్నారని, అయితే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వం నుంచి సహాయం కోరే సమయం వచ్చినప్పుడు వారికి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని ఆయన బీజేపీని విమర్శించారు. ఇంకా ‘‘ఈ ముగ్గురు లేదా నలుగురు బిలియనీర్లు మీకు తెలుసా..? వారు డిపార్ట్‌మెంటల్ స్టోర్ లేదా ఎయిర్‌పోర్ట్‌లో.. ఏదైనా రంగంలోకి, ఏ పరిశ్రమలోనైనా ప్రవేశించవచ్చు, కానీ ఒక సాధారణ పౌరుడు వారి కలలను సాకారం చేసుకోవాలనుకుంటే ద్రవ్యోల్బణం, అవినీతి, నిరుద్యోగానికి గురవుతాడు. నైపుణ్యం కలిగిన యువకులు మంచి డిగ్రీలతో ఉత్తీర్ణత సాధించినప్పటికీ చిన్న ఉద్యోగాలను ఆశ్రయిస్తున్నారు’’ అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

అనంతరం సూరత్‌లో జరిగిన మరో సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ గిరిజనుల సమస్యలపూ తన దృష్టిని సారించారు. ‘‘గిరిజనులను బీజేపీ  ‘అటవీవాసులు’ అని పిలిచి వారిని అణగదొక్కాలని చూస్తుంది. మేము దేశంలోని నాయకులం కాబట్టి గిరిజనులకు అన్ని హక్కులను కల్పించాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోంది.  ఎన్ఆర్ఈజీఏపై రెండు పార్టీల పనిని కూడా పోల్చి చూడండి ఓ సారి. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల కోసం పథకాన్ని తీసుకువచ్చి అందరికీ ఉపాధి కల్పించింది. అయితే బీజేపీ వచ్చి గిరిజనుల భూమిని లాక్కుంది.  ఎన్ఆర్ఈజీఏ స్కామ్ చేసింద’’ని పేర్కొన్నారు.

కాగా, సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగతోంది. ఆయితే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ కొంత విరామం తీసుకున్నారు. జోడో యాత్ర మంగళవారం వరకు రెండు రోజుల విరామం తర్వాత మధ్యప్రదేశ్ నుంచి తిరిగి ప్రారంభమవుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో