Gujarat Election 2022: గుజరాత్‌లో వేడెక్కిన ఎన్నికల ప్రచారం.. ప్రధాని మోదీ, రాహుల్ పోటాపోటీ విమర్శలు..
గుజరాత్ ఎన్నికల ప్రచారం పీక్స్‌కు చేరింది. ప్రధాని మోదీ , అమిత్‌షా , రాహుల్‌గాంధీ , కేజ్రీవాల్ అంతా అక్కడే మకాం వేశారు. ప్రచారంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

గుజరాత్ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల తరపున హేమాహేమీలు బరిలోకి దిగారు. బీజేపీ తరపున ప్రధాని మోదీ , అమిత్‌షా సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున రాహుల్‌గాంథీ బరి లోకి దిగారు. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ రోడ్‌షోలతో దూసుకెళ్తున్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీని మరోసారి టార్గెట్ చేశారు ప్రధాని మోదీ. మీరు రాజకుటుంబానికి చెందినవాళ్లు .. నేను సామాన్య వ్యక్తిని అంటూ విమర్శించారు. అధికారం కోసమే రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు అహంకారం ఎక్కువని అన్నారు. తనను నీచజాతికి చెందిన వ్యక్తి అని కాంగ్రెస్ నేతలు తిట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ వాళ్లు నన్ను బండబూతులు తిట్టారు .. మోదీ స్థాయి ఏంటో నిరూపిస్తామని సవాల్ విసిరారు. మీరు రాజకుటుంబానికి చెందినవాళ్లు.. నేను సామాన్య కార్యకర్తను. నాకు ఏ స్థాయి లేదు. కేవలం నేను ప్రజా సేవకుడిని మాత్రమే. సేవకుడికి స్థాయి ఉంటుందా ? నన్ను నీచజాతికి చెందినవాడివని తిట్టారు. అయినా ఫర్వాలేదు . మీ స్థాయిని ప్రజలే చూపించారు.
గుజరాత్‌లో తొలిసారి రాహుల్ ఎన్నికల ప్రచారం
భారత్ జోడో యాత్రకు బ్రేక్ ఇచ్చి గుజరాత్‌లో తొలిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ. రాజ్‌కోట్,సూరత్‌లో జరిగిన సభల్లో రాహుల్ బీజేపీపై నిప్పులు చెరిగారు. సూరత్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ ఆ తర్వాత ఇప్పుడు రాజ్‌కోట్ చేరుకున్నారు. ఇందులో రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రారంభించిన భారత్ జోడో యాత్రను గుజరాత్‌తో ముడిపెట్టారు. అలాగే గుజరాత్ నుంచి భారత్ జోడో యాత్ర స్ఫూర్తిని పొందామని చెప్పారు. మేము మహాత్మా గాంధీ నుండి ప్రేరణ పొందాము. అలాగే, జాయిన్ ఇండియా యాత్ర గుజరాత్ మీదుగా సాగకపోవడం నాకు బాధగా ఉంది.
30 ఏళ్ల బీజేపీ పాలనలో గుజరాత్ అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందన్నారు. ఆదివాసీలను బీజేపీ వనవాసీలని పిలుస్తుందని , కాని అడవిని బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతోందని ఆరోపించారు. లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఓవైపు నిరుద్యోగం ..మరోవైపు అధికధరలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. యూపీఏ కాలంలో లీటర్ పెట్రోల్ రూ.60 ఉండేది.
ఇప్పుడు వందదాటింది. గ్యాస్ ధర రూ.400 ఉండేది . ఇప్పుడు రూ.1100 అయ్యింది. ఇప్పుడు రెండు భారత్‌లు తయారయ్యాయి. ఒకటి కోటీశ్వరులంది.. వాళ్ల అన్ని స్వప్నాలు నిజమవుతున్నాయి. మరోవైపు రైతులు, పేదల భారతం ఉంది.. మనకు రెండు భారత్‌లు అవసరం లేదు. ఒకటే భారత్ ఉండాలి.. న్యాయమైన భారత్ ఉండాలి. ఈసారి తమ ఓట్లశాతం భారీగా పెరుగుతుందని ఆప్ అధినేత కేజ్రీవాల్ అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం