Pahalgam Terror Attack: హైఅలర్ట్.. ఎయిర్‌పోర్ట్‌లోనే అజిత్ దోవల్‌తో ప్రధాని మోదీ భేటీ.. కీలక నిర్ణయం తీసుకునే అవకాశం..
ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీకి ఎయిర్‌పోర్టులోనే.. పహల్‌గామ్ లో ఉగ్రదాడి ఘటనపై NSA అజిల్ దోవల్ వివరణ ఇచ్చారు. దోవల్‌తోపాటు విదేశాంగమంత్రి, విదేశీ వ్యవహారాల కార్యదర్శి ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు.. కాసేపట్లో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. CCS సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది..

అందమైన కశ్మీరంలో తుపాకుల మోత. టూరిస్టులపై విచక్షణారహిత కాల్పులు. ఉగ్రమూకల పిరికిపంద చర్యకు యావత్ దేశం ఉలిక్కిపడింది. అమాయకుల ప్రాణాలే టార్గెట్‌గా రెచ్చిపోయిన ముష్కరులు అత్యంత హేయంగా ఈ దుశ్చర్యకు దిగారు. కుటుంబాల ముందే మగవారిని మట్టుబెట్టారు. ఆర్తనాదాలు చేస్తున్నా.. తమను వదిలేయమని బతిమాలినా.. ఏమీ చేయొద్దంటూ కాళ్లావేళ్లా వేడుకున్నా ఆ కిరాతకులు వదల్లేదు. విచ్చలవిడిగా కాల్పులు జరిపి పదుల సంఖ్యలో టూరిస్టులను బలితీసుకున్నారు. ప్రశాంతమైన పెహల్గాం మృత్యుఘోష పెట్టింది. ముష్కరుల దాడుల్లో 28 మంది మరణించారు.. వీరిలో ఇద్దరు విదేశీయులు గాయపడ్డారు. దాదాపు 20 మందికి పైగా గాయపడ్డారు. జమ్మూకశ్మీర్ పహల్‌గామ్ లో ఉగ్రదాడి అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ సౌదీ పర్యటనను రద్దు చేసుకున్నారు.. సౌదీ టూర్ మధ్యలో తిరిగొచ్చిన ప్రధాని మోదీ.. పహల్‌గామ్ ఉగ్రదాడిపై అత్యవసర సమీక్ష నిర్వహించారు.
ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీకి ఎయిర్‌పోర్టులోనే.. పహల్‌గామ్ లో ఉగ్రదాడి ఘటనపై NSA అజిల్ దోవల్ వివరణ ఇచ్చారు. దోవల్‌తోపాటు విదేశాంగమంత్రి, విదేశీ వ్యవహారాల కార్యదర్శి ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు.. కాసేపట్లో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. CCS సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.. కాగా.. నిన్న రాత్రే శ్రీనగర్‌కు వెళ్లిన హోం మంత్రి అమిత్ షా.. జమ్ముకశ్మీర్ LG, CMతో పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు.
Delhi | Prime Minister Narendra Modi took a briefing meeting with EAM Dr S Jaishankar, NSA Ajit Doval, Foreign Secretary Vikram Misri and other officials in view of the #PahalgamTerroristAttack in Kashmir pic.twitter.com/F1LnHakHrU
— ANI (@ANI) April 23, 2025
ఉగ్రదాడితో.. జమ్మూ కశ్మీర్‌లో హై అలర్ట్ ప్రకటించారు. అణువణువూ గాలిస్తున్నారు. నింగి, నేల ఏదీ వదలడం లేదు. కొండలు, గుట్టలు, అనుమానాస్పద ప్రాంతాల్లో.. క్షణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇండియన్ ఆర్మీ, సీఆర్‌పీఎఫ్, వాయుసేన బలగాలు కూంబింగ్‌లో పాల్గొంటున్నాయి. ఉగ్రదాడి ఘటనపై NIA కూడా రంగంలోకి దిగింది. ఇవాళ NIA బృందాలు ఘటనాస్థలానికి చేరుకోనున్నాయి..
మరోవైపు.. దేశవ్యాప్తంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. బిహార్ పాట్నాలో పాక్ ఫ్లాగ్, పాకిస్తాన్ ప్రధాని ప్లకార్డులను దగ్దం చేశారు. ఉగ్రవాదులను పాక్ పెంచి పోషిస్తుందంటూ నినాదాలు చేశారు. పాక్‌కు తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




