West Bengal Elections 2021: అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్.. పశ్చిమ బెంగాల్‌లో భారీగా పట్టుబడిన మద్యం, డబ్బు, డ్రగ్స్..
West Bengal Elections 2021: పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మద్యం, డబ్బు పంపిణీ కార్యక్రమం విచ్చల విడిగా సాగుతోంది.
West Bengal Elections 2021: పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మద్యం, డబ్బు పంపిణీ కార్యక్రమం విచ్చల విడిగా సాగుతోంది. ఓవైపు అధికారులు ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. అభ్యర్థులు కొత్త కొత్త విధానాల్లో తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 248.9 కోట్ల నగదు సహా ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పశ్చిమ బెంగాల్ అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సంజోయ్ బసు వెల్లడించారు. ‘‘ఇప్పటి వరకు మొత్తం రూ. 248.9 కోట్ల విలువైన నగదు, వస్తువులను స్వాధీనం చేసుకున్నాం. ఇందులో రూ. 37.72 కోట్ల నగదు, రూ .9.5 కోట్ల విలువైన మద్యం, 114.44 కోట్ల రూపాయల డ్రగ్స్ ఉన్నాయి’ అని సంజయ్ బసు ప్రకటించారు.
కాగా, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ శనివారం ముగిసిన విషయం తెలిసిందే. మొదటి దశ ఎన్నికల్లో 79.79 శాతం ఓట్లు పోలయ్యాయి. మొదటి దశలో, పురులియా, జార్గ్రామ్ జిల్లాల పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు సహా.. బంకురా, పూర్బా మిడ్నాపూర్, పశ్చిమ మిడ్నాపూర్ సెగ్మెంట్లకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో 21 మంది మహిళలతో సహా 191 మంది అభ్యర్థుల పోటీ పడ్డారు. 294 మంది అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది దశలుగా ఎన్నికలను నిర్వహిస్తున్న ఇప్పటికే ఒక దశ ఎన్నికల ప్రక్రియ ముగియగా.. మిగిలిన ఏడు దశల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఏప్రిల్ 29న తుదిదశ పోలింగ్ నిర్వహించనున్నారు. మే 2న ఓట్లు లెక్కించి ఫలితాలను లెక్కించనున్నారు.
Also read: