కుల వివాదం.. 35 కత్తి పోట్లతో యువకుడి దారుణ హత్య..!

తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుల కక్షలతో ఓ యువకుడిని దారుణంగా హతమార్చారు దుండగులు. 35 కత్తి పోట్లతో యువకుడి శరీరాన్ని చిద్రం చేసి,

కుల వివాదం.. 35 కత్తి పోట్లతో యువకుడి దారుణ హత్య..!
Follow us

| Edited By:

Updated on: Jun 01, 2020 | 7:47 PM

తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుల కక్షలతో ఓ యువకుడిని దారుణంగా హతమార్చారు దుండగులు. 35 కత్తి పోట్లతో యువకుడి శరీరాన్ని చిద్రం చేసి, తల- మొండెంను వేరు చేసి చంపేశారు. తూత్తుకుడిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల వివరాల ప్రకారం.. తూత్తుకుడి జిల్లా, కీల కీరనుర్‌ గ్రామంలో గత సంవత్సరం వేరే కులానికి చెందిన వ్యక్తిని మెజార్టీ వర్గానికి చెందిన వారి శ్మశాన వాటికలో పూడ్చటానికి ప్రయత్నించారు. ఇందుకు సదరు వర్గం ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో సత్యమూర్తి అనే 22 ఏళ్ల యువకుడు మెజార్జీ వర్గాన్ని ఎదురించి చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని అక్కడ పూడ్చాడు. ఆ సమయంలో ఇరు వర్గాల మధ్య చిన్న గొడవ కూడా జరిగింది. అయితే ఈ విషయం పోలీసుల వరకు వెళ్లలేదు.

ఇక గత శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సత్యమూర్తి రాత్రైనా ఇంటికి చేరుకోలేదు. దీంతో తల్లిదండ్రులు సత్యమూర్తి కోసం వెతకగా.. ఊరికి దూరంగా అర కిలోమీటరు దూరంలో అతడి తల లేని శరీరం కనిపించింది. శరీరంపై దాదాపు 35 కత్తిపోట్లు ఉన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి 400 మీటర్ల దూరంలో తలను గుర్తించారు. ఆ వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఈ ఘటనతో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Read This Story Also: మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్..!

కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..