భగ్గుమన్న కార్మికులు.. ఐఫోన్ తయారీ సంస్థకు తాకిన నిరసన సెగ.. పలు కార్లను దగ్ధం చేసిన నిరసనకారులు..
కర్ణాటకలోని కోలార్ జిల్లాలోగల ఐఫోన్ తయారీ సంస్థకు నిరసన సెగ తగిలింది. తైవాన్ ప్రధాన్ కేంద్రంగా ఉన్న విస్ట్రోన్ కార్పొరేషన్ సంస్థ
కర్ణాటకలోని కోలార్ జిల్లాలోగల ఐఫోన్ తయారీ సంస్థకు నిరసన సెగ తగిలింది. తైవాన్ ప్రధాన్ కేంద్రంగా ఉన్న విస్ట్రోన్ కార్పొరేషన్ అనుబంధ సంస్థగా ఉన్న కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని నర్సపూర్ ఇండస్ట్రీలో పనిచేసే ఉద్యోగులు నిరసన చేపట్టారు. తమకు యాజమాన్యం జీతాలు సరైన సమాయానికి అందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఇదే విషయంపై సంస్థపై ఉద్యోగులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సంస్థ ఫర్నిచర్, వాహనాలు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్లు దెబ్బతిన్నాయని కంపెనీ యాజమాన్యం ఆరోపించింది. అటు తమకు చాలా కాలం నుంచి కంపెనీ జీతాలు సరైన సమయానికి చెల్లించడం లేదని, కాంట్రాక్టు ఉద్యోగుల కాలపరిమితిని తగ్గించాలని యాజమాన్యానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడం లేదని నిరసనకారులు తెలిపారు. కంపెనీ ముందు ఉన్న కార్లను నిరసనకారులు దగ్ధం చేశారు.