అక్రమసంబంధం.. ప్రియుడితో భర్త హత్యకు భార్య యత్నం!

నిండునూరేళ్లు కలిసి ఉంటామని పెద్దల సాక్షిగా ఒక్కటయ్యారు. కానీ కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ ఇళ్లాలు ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు కుట్ర చేసింది. నిద్రిస్తున్న భర్తపై ఇద్దరు దాడి చేశారు. దీంతో నిద్ర లేచిన ఆయన.. భయంతో పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఘటన చిత్తూరు గంగాధర నెల్లూరు మండలం కాలేపల్లిలో చోటు చేసుకుంది. భారతి, గోపాల్‌లు కాలేపల్లిలో నివాసం ఉంటున్నారు. మధ్యలో దినకర్‌ అనే వ్యక్తితో ఆమెకు పరిచయముంది. ఇద్దరు సన్నిహితంగా ఉండటంపై భర్త భారతిని మందలించాడు. […]

  • Tv9 Telugu
  • Publish Date - 4:59 pm, Mon, 6 January 20
అక్రమసంబంధం.. ప్రియుడితో భర్త హత్యకు భార్య యత్నం!

నిండునూరేళ్లు కలిసి ఉంటామని పెద్దల సాక్షిగా ఒక్కటయ్యారు. కానీ కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ ఇళ్లాలు ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు కుట్ర చేసింది. నిద్రిస్తున్న భర్తపై ఇద్దరు దాడి చేశారు. దీంతో నిద్ర లేచిన ఆయన.. భయంతో పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఘటన చిత్తూరు గంగాధర నెల్లూరు మండలం కాలేపల్లిలో చోటు చేసుకుంది.

భారతి, గోపాల్‌లు కాలేపల్లిలో నివాసం ఉంటున్నారు. మధ్యలో దినకర్‌ అనే వ్యక్తితో ఆమెకు పరిచయముంది. ఇద్దరు సన్నిహితంగా ఉండటంపై భర్త భారతిని మందలించాడు. దీంతో తమ అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడనే దానిపై కక్ష పెంచుకున్న ఆమె.. ప్రియుడు దినకర్‌తో కలిసి నిద్రిస్తున్న భర్త గోపాల్‌పై దాడి చేశారు. కాగా.. మెలుకువ వచ్చిన గోపాల్.. అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఆయన మెడ, నుదుటిపై కత్తిపోట్లయ్యాయి. ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న గోపాల్‌ను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు స్థానికులు. బాధితుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గంగాధర నెల్లూరు పోలీసులు. భారతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యా యత్నానికి వివాహేత సంబంధమే కారణమని భావిస్తున్నారు.