AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లిక్క‌ర్ దొర‌క్క స్పిరిట్ తాగిన యువ‌కుడు మృతి..మ‌రో ఇద్ద‌రు..

లాక్ డౌన్ నేప‌థ్యంలో కొంద‌రు మందుబాబులు విప‌రీత‌మైన క‌ష్టాలు ఎదుర్కుంటున్నారు. ఆల్క‌హాల్ విత్ డ్రా సిండ్రోమ్ బాధ‌ప‌డుతూ పిచ్చిప‌ట్టిన‌వాళ్ల‌లా బిహేవ్ చేస్తున్నారు. మ‌రికొంద‌రు మందు లేకుండా ఉండ‌లేక వివిధ ద్రావ‌కాల‌ను సేవిస్తున్నారు. అవి ప్ర‌మాద‌క‌రంగా మారి వారి ప్రాణాలను హ‌రిస్తున్నాయి. తాజాగా మద్యం దొరక్క స్పిరిట్‌ తాగిన ఓ యువ‌కుడు త‌న నిండు జీవితాన్ని చాలించాడు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో నివ‌శించే ధర్నాల నవీన్‌ మూర్తిరాజు(22), అల్లాడి వెంకటేష్‌, ఇరగవరం మండలం కావలిపురానికి చెందిన […]

లిక్క‌ర్ దొర‌క్క స్పిరిట్ తాగిన యువ‌కుడు మృతి..మ‌రో ఇద్ద‌రు..
Ram Naramaneni
| Edited By: |

Updated on: Apr 01, 2020 | 3:51 PM

Share

లాక్ డౌన్ నేప‌థ్యంలో కొంద‌రు మందుబాబులు విప‌రీత‌మైన క‌ష్టాలు ఎదుర్కుంటున్నారు. ఆల్క‌హాల్ విత్ డ్రా సిండ్రోమ్ బాధ‌ప‌డుతూ పిచ్చిప‌ట్టిన‌వాళ్ల‌లా బిహేవ్ చేస్తున్నారు. మ‌రికొంద‌రు మందు లేకుండా ఉండ‌లేక వివిధ ద్రావ‌కాల‌ను సేవిస్తున్నారు. అవి ప్ర‌మాద‌క‌రంగా మారి వారి ప్రాణాలను హ‌రిస్తున్నాయి. తాజాగా మద్యం దొరక్క స్పిరిట్‌ తాగిన ఓ యువ‌కుడు త‌న నిండు జీవితాన్ని చాలించాడు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో నివ‌శించే ధర్నాల నవీన్‌ మూర్తిరాజు(22), అల్లాడి వెంకటేష్‌, ఇరగవరం మండలం కావలిపురానికి చెందిన పండూరి వీరేష్‌, విప్పర్తి శ్యాంసుందరం, తణుకు దుర్గారావు, కె.వెంకటదుర్గాప్రసాద్‌ స్నేహితులు. వీరిలో వీరేష్ అనే వ్య‌క్తి స్థానికంగా ఉన్న కెమిక‌ల్స్ కంపెనీలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. మ‌ద్యం లేక‌పోవ‌డంతో మార్చి 29న తాను పనిచేసే కంపెనీకి వచ్చిన స్పిరిట్‌ తీసుకొచ్చాడు. దాన్ని ర‌హ‌స్యంగా తీసుకెళ్లి… కావలిపురం చెరువు వద్ద కూల్ డ్రింక్ లో కలుపుకొని స్నేహితులంతా తాగి ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. అయితే 30న తేదీన విప‌రీత‌మైన‌ కడుపు మంటతో తణుకులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవీన్‌ మూర్తిరాజు క‌న్నుమూశాడు. ఇదే సమస్యతో వీరేష్‌, వెంకటేష్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత