Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakhapatnam: భార్య తిట్టిందని భర్త ఘాతుకం.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తానూ ఆత్మహత్యాయత్నం..!

అనుమానం పెనుభూతమైంది. దానికి తోడు ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. ఓ వైపు భర్త సూటి పోటీ మాటలు.. మరోవైపు కుటుంబ భారం తాళలేక భార్య ఆత్మహత్యకు యత్నించింది.

Visakhapatnam: భార్య తిట్టిందని భర్త ఘాతుకం.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తానూ ఆత్మహత్యాయత్నం..!
Father And Two Children Attempt Suicide
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 20, 2021 | 9:47 PM

Father and Two Children Suicide Attempt: అనుమానం పెనుభూతమైంది. దానికి తోడు ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. ఓ వైపు భర్త సూటి పోటీ మాటలు.. మరోవైపు కుటుంబ భారం తాళలేక భార్య ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను అడ్డుకున్న భర్త తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తానూ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో తన ఇద్దరు పిల్లలతో సహా తండ్రి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన గురువారం యారాడలో సంచలనం రేపింది. బంధువులు సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో వారంతా ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు.

న్యూపోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు పిల్లలు, భరతో కలిసి మొల్లి శ్రీను అనే వ్యక్తి కుటుంబం యారాడలో నివాసం ఉంటున్నాడు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య మొల్లి సంధ్య కూడా కూలి పనులు చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటోంది. శ్రీను ఐదు నెలలుగా పనులకు వెళ్లకుండా ఇంటి పట్టునే ఉంటున్నాడు. భార్య సంపాదనపైనే ఆధారపడుతున్నాడు. జల్సాగా తిరుగుతున్నాడు.

ఈ క్రమంలోనే భార్యపై అనుమానం పెంచుకున్నాడు శ్రీను. దీంతో భార్యాభర్తల మధ్య మొదలైన గొడవ నిత్యం ఘర్షణలకు దారి తీసింది. ఈ క్రమంలోనే గురువారం రాత్రి ఇరువురి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన శ్రీను తన 14 ఏళ్ల కుమార్తె అనూష, పదేళ్ల కుమారుడు చరణ్‌లకు బాదం పాలల్లో పురుగు మందు ఇచ్చి తాను కూడా సేవించాడు. దీంతో వారందరూ అపస్మారక స్థితికి చేరుకున్నారు.

ఇది గమనించిన బంధువులు వెంటనే వారిని గాజువాకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. సంఘటన తెలిసిన వెంటనే న్యూపోర్టు పోలీసులు ఆస్పత్రికి చేరుకుని పిల్లల నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. వారి స్టేట్‌మెంట్‌ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన యారాడలో సంచలనం రేపింది. బంధువులు సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో వారంతా ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు.

Read Also…  BHEL Recruitment: బీహెచ్‌ఈఎల్‌లో సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షల వరకు జీతం పొందే అవకాశం.

Grain Money Scam: రైతుల ధాన్యం సొమ్ము గోల్‌మాల్.. 11 మంది బినామీల ఖాతాల్లో జమ.. వడ్ల పైసల్‌ బుక్కిన సర్పంచ్‌..!