BHEL Recruitment: బీహెచ్‌ఈఎల్‌లో సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షల వరకు జీతం పొందే అవకాశం.
BHEL Recruitment: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఈ సంస్థ దేశ వ్యాప్తంగా ఉన్న..
BHEL Recruitment: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఈ సంస్థ దేశ వ్యాప్తంగా ఉన్న పలు యూనిట్లలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. గత బుధవారం (ఆగస్టు 18) దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 27 సీనియర్ మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్) పోస్టులను భర్తీ చేయనున్నారు. * మెడిసిన్, అనెస్తీషియా, రేడియాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎంబీబీఎస్‌తో పాటు సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అంతేకాకుండా సంబంధిత పనిలో ఏడాది అనుభవం తప్పనిసరి. * అభ్యర్థుల వయసు 01-08-2021 నాటికి 37 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను తొలుత అర్హతల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. * ఎంపికైన అభ్యర్థులకు నెలకి రూ. 70,000 నుంచి రూ. 200000 వరకు జీతంగా అందిస్తారు. * ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ 18-08-2021న ప్రారంభంకాగా 07-09-2021న ముగియనుంది. * దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి..