AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్వర్ణ ప్యాలెస్‌ ఘటనలో రాయపాటి మరో కోడలు విచారణ

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా గుంటూరు రమేష్ హాస్పిటల్‌కు వెళ్లారు విజయవాడ పోలీసులు. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కోడలు డాక్టర్‌ శైలజను విచారిస్తున్నారు.

స్వర్ణ ప్యాలెస్‌ ఘటనలో రాయపాటి మరో కోడలు విచారణ
Balaraju Goud
|

Updated on: Aug 18, 2020 | 6:43 PM

Share

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా గుంటూరు రమేష్ హాస్పిటల్‌కు వెళ్లారు విజయవాడ పోలీసులు. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కోడలు డాక్టర్‌ శైలజను విచారిస్తున్నారు. రమేష్ ఆస్పత్రిలో ఆస్తర్ కంపెనీ పెట్టుబడులపై ఆరా తీస్తున్నారు. రాయపాటి మరో కోడలు డాక్టర్‌ మమతను ఇంతకుముందే పోలీసులు విచారించారు. స్వర్ణ ప్యాలెస్, రమేష్ ఆస్పత్రికి మధ్య జరిగిన ఒప్పంద పత్రాన్ని ఇప్పటి వరకు కూడా దర్యాప్తు అధికారులకు సమర్పించలేదు. నోటీసులుఇచ్చినా కూడా తమ ముందు హాజరు కావడానికి రమేష్ బాబు సాకులు చెబుతున్నారని.పోలీసులు అంటున్నారు. 9 రోజులుగా జరుగుతున్న దర్యాప్తులో పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. పరారీలో ఉన్నవారి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

కాగా, స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాదం కేసులో రమేష్ ఆస్పత్రి యజమాని డాక్టర్ రమేష్ బాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన జిల్లా కోర్టును ఆశ్రయించారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ లో అగ్ని ప్రమాదం సంభవించి పది మంది మరణించిన విషయం తెలిసిందే….

Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా