స్టాక్ మార్కెట్ నష్టాలతో మద్యానికి బానిసైయ్యాడు.. భార్య వదిలేసింది! చివరికి గదిలో పొగపెట్టుకొని..
స్టాక్ మార్కెట్ నష్టాలు, ఆర్థిక ఇబ్బందులతో లవ్ కుమార్ అనే ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నారు. తన గదిలో పొగ సృష్టించి ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సూసైడ్ నోట్‌లో ఆస్తి తగాదాలు, ఆర్థిక సమస్యలను పేర్కొన్నాడు. భార్యకు మెసేజ్ పంపి ఈ చర్యకు పాల్పడ్డాడు.

స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలతో ఒక ఇంజనీర్ పొగతో నిండిన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గురువారం తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు, ఆస్తి తగాదాల కారణంగా తాను ఈ తీవ్రమైన చర్య తీసుకుంటున్నానని లవ్ కుమార్ రాసిన సూసైడ్ నోట్ గది నుండి లభించిందని పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటన బుధవారం ఉత్తరాఖండ్‌లోని అరిహంత్ విహార్ ప్రాంతంలో జరిగింది.
వృత్తిరీత్యా కెమికల్ ఇంజనీర్ అయిన లవ్ కుమార్ తన గదిలోని హీటర్‌పై బొగ్గును మండించి పొగను సృష్టించి, లోపల ఉండి తాళం వేసుకుని ఊపిరాడక మరణించాడు. దీనికి ముందు కుమార్ తన భార్యకు వాట్సాప్‌లో కార్బన్ మోనాక్సైడ్ తాగి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ సందేశం పంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమార్ స్టాక్ మార్కెట్ నష్టాలతో తీవ్ర మనస్తాపానికి గురై మద్యానికి బానిసయ్యాడు. ఈ అలవాటుతో ఇబ్బంది పడిన అతని భార్య తన పిల్లలతో కలిసి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది.
కుమార్ సందేశాన్ని వాట్సాప్‌లో చూసిన తర్వాత ఆమె పదేపదే అతనికి ఫోన్ చేసింది. కానీ అతను ఫోన్‌కు సమాధానం ఇవ్వకపోవడంతో అతని కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు వచ్చి తలుపు పగలగొట్టి చూసేసరికి గది పొగతో నిండిపోయింది, కుమార్ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




