చేసిన అప్పులు తీర్చలేక కన్నకూతుర్నే అమ్మేశాడు ఓ కసాయి తండ్రి.. ఏడాదిపాటు అమ్మాయిని బంధించి లైంగిక వేధింపులు..!

కంటికి రెప్పలా కాపాడాల్సిన రక్త సంబంధీకులే కాదనుకుంటున్నారు. ప్రభుత్వం ఎన్నిక కఠిన చట్టాలు తీసుకువచ్చిన కట్టడి చేయలేకపోతున్నాయి.

చేసిన అప్పులు తీర్చలేక కన్నకూతుర్నే అమ్మేశాడు ఓ కసాయి తండ్రి.. ఏడాదిపాటు అమ్మాయిని బంధించి లైంగిక వేధింపులు..!
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 19, 2021 | 4:01 PM

Man sell daughter : తరాలు మారినా, యుగాలు మారినా అబల పట్ల విపక్షత కొనసాగుతూనే ఉంది. కామంతో మత్తెక్కిన మూర్ఖులు మానసికంగా, శారీరకం హింసిస్తూనే ఉన్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన రక్త సంబంధీకులే కాదనుకుంటున్నారు. ప్రభుత్వం ఎన్నిక కఠిన చట్టాలు తీసుకువచ్చిన కట్టడి చేయలేకపోతున్నాయి. తాజాగా చేసిన అప్పులు తీర్చలేక.. ఓ తండ్రి కన్నకూతుర్నే బేరం పెట్టాడు. ఈ దుర్మార్గపు ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

మీరట్ జిల్లాలో తీసుకున్న అప్పు చెల్లించలేక ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కన్న కూతురినే అమ్మేశాడు. ఘజియాబాద్ జిల్లాకు పార్తాపూర్‌ ప్రాంతంలోని శతాబ్దినగర్‌‌కు చెందిన ఓ వ్యక్తి ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గతంలో పలు క్రిమినల్ కేసులతో కొన్నాళ్లు తీహార్, దాస్నా జైళ్లలో శిక్ష అనుభవించాడు. అయితే అతడు బరాట్ జిల్లాలో నివసిస్తున్న వ్యక్తి నుంచి రూ. 2 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అయితే, ఆ రుణాన్ని తిరిగి చెల్లించలేకపోయాడు. తీసుకున్న రుణం తిరిగి ఇవ్వాలంటూ అప్పు ఇచ్చిన వ్యక్తి ఒత్తిడి తీసుకువచ్చాడు.

ఈ క్రమంలోనే అప్పుకు బదులు తన కూతురిని అతనికి విక్రయించాడు. ఆ తర్వాత అప్పు ఇచ్చిన వ్యక్తి బాధితురాలిని ఒక సంవత్సరం పాటు బంధించాడు. ఆ సమయంలో బాధిత యువతిపై మానసికంగా, లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడు. అయితే, గతకొద్ది రోజుల క్రితం యువతి అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. అనంతరం తల్లి సాయంతో మీరట్ ఎస్పీ రామర్జ్‌ను ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయంపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను లైంగిక వేధింపుకులకు గురైనట్టుగా ఫిర్యాదులో పేర్కొంది. తన భర్త కూతురిని హింసించినట్టుగా బాధితురాలి తల్లి కూడా పోలీసులకు తెలిపింది. అడ్డుకునేందకు ప్రయత్నించిన సమయంలో తనపై దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో ఈ ఘటనపై మీరట్ ఎస్పీ రామర్జ్ స్పందిస్తూ.. బాధితురాలి ఫిర్యాదుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని స్థానిక పోలీసులను ఆదేశించినట్టు తెలిపారు. నిందితులను తప్పకుండా శిక్షిస్తామని వెల్లడించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

Read Also…  Police Case File: మాజీ ప్రజాప్రతినిధి వివాహ వార్షికోత్సవంలో అశ్లీల నృత్యాలు.. ఆలస్యంగా వెలుగులోకి వీడియోలు..