AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Bomb Scare: ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు… పాఠశాలలకు మెయిల్‌ పంపిన దుండగులు

దేశంలో బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటి వరకు రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు, ఎయిర్‌పోర్టులే టార్గెట్‌గా బెదిరింపులకు పాల్పడిన దుండగులు ఇప్పుడు స్కూళ్లను లక్ష్యంగా చేసుకున్నారు. దేశంలో ఉగ్రవాద సంస్థల స్లీపర్‌ సెల్స్‌ యాక్టివ్‌ అయ్యాయనే అనుమానాల నేపథ్యంలో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం...

Delhi Bomb Scare: ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు... పాఠశాలలకు మెయిల్‌ పంపిన దుండగులు
Delhi Police
K Sammaiah
|

Updated on: Jul 14, 2025 | 12:12 PM

Share

దేశంలో బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటి వరకు రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు, ఎయిర్‌పోర్టులే టార్గెట్‌గా బెదిరింపులకు పాల్పడిన దుండగులు ఇప్పుడు స్కూళ్లను లక్ష్యంగా చేసుకున్నారు. దేశంలో ఉగ్రవాద సంస్థల స్లీపర్‌ సెల్స్‌ యాక్టివ్‌ అయ్యాయనే అనుమానాల నేపథ్యంలో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. సోమవారం ఉదయం ఢిల్లీలోని పలు పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా పాఠశాలల్లో తనిఖీలు చేపట్టారు.

ఢిల్లీలోని చాణక్యపురిలో గల నేవీ స్కూల్‌, ద్వారక ప్రాంతంలోని సీఆర్‌పీఎఫ్‌ పాఠశాలకు సోమవారం ఉదయం బాంబు బెదిరింపులు మెయిల్స్‌ వచ్చాయి. రెండు పాఠశాలలకు మెయిల్స్‌ చేసిన ఆగంతకులు స్కూల్స్‌ ఆవరణలో బాంబులు పెట్టినట్లు ఏ క్షణంలోనైనా పేల్చాస్తామని ఆ మెయిల్స్‌ సారాంశం. దీంతో అప్రమత్తమైన పాఠశాలల యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ సిబ్బందితో రంగంలోకి దిగారు. రెండు పాఠశాలల్లోనూ తనిఖీలు చేపట్టారు ఢిల్లీ పోలీసులు. బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ సాయంతో క్షుణ్ణంగా అణువణువు తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు ప్రకటకించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

క్యూర్, ప్యూర్, రేర్ మోడల్‌తో తెలంగాణ అభివృద్ది: భట్టి విక్రమార్క
క్యూర్, ప్యూర్, రేర్ మోడల్‌తో తెలంగాణ అభివృద్ది: భట్టి విక్రమార్క
ఏటీఎంలో నకిలీ రూ.500 నోట్లు.. ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే
ఏటీఎంలో నకిలీ రూ.500 నోట్లు.. ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే
ప్రియుడు కాదు.. రాక్షసుడు.. పెళ్లికి ఒప్పుకోలేదని.. పట్టపగలే..
ప్రియుడు కాదు.. రాక్షసుడు.. పెళ్లికి ఒప్పుకోలేదని.. పట్టపగలే..
పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. డిసెంబర్ 18 వరకే ఛాన్స్!
పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. డిసెంబర్ 18 వరకే ఛాన్స్!
15 మందితో టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్.. ఆ ఇద్దరిని ఛీకొట్టిన గంభీర్?
15 మందితో టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్.. ఆ ఇద్దరిని ఛీకొట్టిన గంభీర్?
చైనా, జపాన్‌తో పోటీ.. గ్లోబల్ సమ్మిట్‌లో రేవంత్ కామెంట్స్
చైనా, జపాన్‌తో పోటీ.. గ్లోబల్ సమ్మిట్‌లో రేవంత్ కామెంట్స్
కోకాపేట ప్లాట్లకు అందుకే ఆ రేంజ్‌ ధరలు
కోకాపేట ప్లాట్లకు అందుకే ఆ రేంజ్‌ ధరలు
నిరుద్యోగులకు భలే న్యూస్.. రాత పరీక్షలేకుండా సింగరేణిలో ఉద్యోగాలు
నిరుద్యోగులకు భలే న్యూస్.. రాత పరీక్షలేకుండా సింగరేణిలో ఉద్యోగాలు
అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోంది: సీఎం రేవంత్ రెడ్డి
అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోంది: సీఎం రేవంత్ రెడ్డి
నటి వేధింపుల కేసులో A8 దిలీప్‌పై కేసు కొట్టివేత
నటి వేధింపుల కేసులో A8 దిలీప్‌పై కేసు కొట్టివేత