AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Crime News: అటవీ ప్రాంతంలో మృతదేహాల కలకలం.. తమిళనాడులో చంపి.. చిత్తూరు జిల్లాలో..

Dead bodies found in forest area: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోని అటవీ ప్రాంతంలో దంపతుల మృతదేహాలు కలకలం సృష్టించాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా రామచంద్రాపురం

AP Crime News: అటవీ ప్రాంతంలో మృతదేహాల కలకలం.. తమిళనాడులో చంపి.. చిత్తూరు జిల్లాలో..
Couple Murder
Shaik Madar Saheb
| Edited By: |

Updated on: Aug 02, 2021 | 8:57 AM

Share

Dead bodies found in forest area: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోని అటవీ ప్రాంతంలో దంపతుల మృతదేహాలు కలకలం సృష్టించాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం చిట్టత్తూరు అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. రెండు మృతదేహాలు లభ్యమైనట్లు రామచంద్రాపురం పోలీసులు వెల్లడించారు. ఈ దంపతులు మూడు రోజుల క్రితం హత్యకు గురైనట్లు పోలీసులు పేర్కొంటున్నారు. అయితే మృతులది తమిళనాడు తిరుత్తణి అని పేర్కొన్నారు.

అయితే.. ఈ దంపతులపై నాలుగు రోజుల క్రితం తమిళనాడు తిరుత్తణి పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు అయింది. అనంతరం దుండగులు దంపతులను చంపి మృతదేహాలను చిత్తూరులోని చిట్టత్తూరు అడవుల్లో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులు సంజీవరెడ్డి (60), మాల (60) గా తమిళనాడు తిరుత్తణి పోలీసులు గుర్తించారు.

ఈ ఘటనకు ఆస్తి వివాదాలు కారణమా లేక.. మరేమైనా ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే చిత్తూరు జిల్లా పరిధిలోని అడవుల్లో మృతదేహాలను పడేయడం సంచలనంగా మారింది. అటుగా వెళ్లిన వ్యక్తులు మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారమందించారు.

Also Read:

Sriram Sagar Project: స్నేహితుల దినోత్సవం రోజున విషాదం.. శ్రీరాం సాగర్‌లో ముగ్గురు యువకుల గల్లంతు..

Youth Gang War: స్నేహితులదినోత్సవం రోజున స్నేహం మరచి కర్రలతో దాడి చేసుకున్న యువకులు.. వీడియో వైరల్