Expiry Biscuits: బిస్కెట్లు తిన్న ఇద్దరు చిన్నారులకు అస్వస్థత.. తీరా విషయం తెలిసి తల్లిదండ్రులు షాక్..!
కాలం తీరిన బిస్కెట్స్ ఇద్దరు చిన్నారుల ప్రాణం మీదకు వచ్చింది. ఎక్స్పైరీ డేట్ దాటిన బిస్కెట్లు తిన్న ఇద్దరు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు.
Two Children sick With Biscuits: కాలం తీరిన బిస్కెట్స్ ఇద్దరు చిన్నారుల ప్రాణం మీదకు వచ్చింది. ఎక్స్పైరీ డేట్ దాటిన బిస్కెట్లు తిన్న ఇద్దరు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ హైదర్ గూడ ప్రాంతంలో గత కొంతకాలంగా బిజ్జ వెంకటేష్ అనే వ్యక్తి కిరాణ జనరల్ స్టోర్స్ నిర్వహిస్తున్నాడు. దీంతో ఆ స్టోర్‌లో స్థానికంగా ఉంటున్న ఓమ్‌రెడ్డి అనే వ్యక్తి 10 బిస్కెట్ ప్యాకెట్లు కొనుగోలు చేశాడు. అయితే వాటిని ఓమ్‌రెడ్డి తన కుమారులకు ఇచ్చాడు.
ఆ బిస్కెట్లు తిన్న ఇద్దరు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వాటిని తిన్నాక పిల్లలకు వాంతులవడం ప్రారంభం అయ్యాయి. వెంటనే తండ్రి వారిద్దరిని హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. చికిత్స చేసిన వైద్యులు ఫుడ్ ఫాయిజన్ అని చెప్పారు. ఓమ్‌రెడ్డి బిస్కెట్ ప్యాకెట్ లను గమనించగా అవి ఎక్స్పైరీ అయి మూడు నెలలు అయినట్లు గుర్తించారు. వెంటనే వెళ్లి స్టోర్ యజమానిని నిలదీశాడు. అతడు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిరాణా షాపు యజమాని బిజ్జ వెంకటేష్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Read Also… GHMC Fever Survey: కోవిడ్ నియంత్రణలో భాగంగా హైదరాబాద్‌లో 1680 బృందాలతో 1,73,757 ఇళ్లలో సర్వే