Tragedy: వాలంటైన్స్ డే రోజే విషాదం.. నమ్మి వస్తే నిండా ముంచాడు.. ఏకంగా ప్రాణమే తీసిండు..!

కలిసే బ్రతుకుదామనుకున్నారు. సహజీవనం చేస్తున్నారు. అయితే బంధువులు, చుట్టుపక్క వారి చీదరింపులు తట్టుకోలేక, తనువులు చాలించాలనుకున్నారు. అనుకున్నదీ అనుకున్నట్లు జరిగితే ఇద్దరూ చనిపోయేవారే..! కానీ పురుగు మందు తాగి యువతి చనిపోతే, అతను మాత్రం అక్కడి నుండి పరారయ్యాడు. దీంతో ఆ యువకుడే పక్కగా స్కెచ్ వేసి యువతి అడ్డు తొలగించుకన్నట్లు కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో.. యువతి మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tragedy: వాలంటైన్స్ డే రోజే విషాదం.. నమ్మి వస్తే నిండా ముంచాడు.. ఏకంగా ప్రాణమే తీసిండు..!
Tragedy On Valentines Day
Follow us
T Nagaraju

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 16, 2024 | 10:17 AM

కలిసే బ్రతుకుదామనుకున్నారు. సహజీవనం చేస్తున్నారు. అయితే బంధువులు, చుట్టుపక్క వారి చీదరింపులు తట్టుకోలేక, తనువులు చాలించాలనుకున్నారు. అనుకున్నదీ అనుకున్నట్లు జరిగితే ఇద్దరూ చనిపోయేవారే..! కానీ పురుగు మందు తాగి యువతి చనిపోతే, అతను మాత్రం అక్కడి నుండి పరారయ్యాడు. దీంతో ఆ యువకుడే పక్కగా స్కెచ్ వేసి యువతి అడ్డు తొలగించుకన్నట్లు కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో.. యువతి మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పొన్నూరు మండలం మన్నవ గ్రామం…గ్రామానికి చెందిన వంశీ అనే యువకుడికి అదే గ్రామానికి చెందిన బంధువైన సునీతకు మధ్య పరిచయం ఏర్పడింది. అప్పటికే వివాహం అయిన సునీతకు వంశీకి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొద్దీ రోజుల పాటు ఈ వివాహేతర సంబంధం కొనసాగింది. వంశీ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇద్దరూ బంధువులు కావటం సహజీవనం చేస్తుండటంతో బంధువులందరూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో కలిసి జీవించడం సాధ్యం కాదనుకున్నారు. వంశీ లేకుండా తాను జీవించలేనని సునీత తేల్చి చెప్పింది. దీన్నే అలుసుగా తీసుకున్న వంశీ పక్కాగా ప్లాన్ వేశాడు. వంశీ మాటలు నమ్మిన ఆమె తన ప్రాణాలను పొగొట్టుకుంది.

మన్నవలోనే ఉంటున్న వీరిద్దరని బంధువులు హెచ్చరిస్తుండంటంతో సునీత వద్దకు వచ్చిన వంశీ కలిసి జీవించలేమని చెప్పాడు. కనీసం కలిసి చనిపోదామంటూ ఆమెకు ప్రపోజ్ చేశాడు. వంశీ మాటలు నిజమని నమ్మిన సునీత అతని ప్రపోజల్ కు ఒప్పుకుంది. ప్రేమికుల రోజున ఇద్దరూ కలిసి పొన్నూరు వచ్చారు. నిర్మానుష ప్రాంతానికి వెళ్లారు. పురుగు మందు కొని తీసుకొచ్చాడు వంశీ. ఆ పురుగు మందును ఇద్దరూ తాగాలనుకున్నారు. ముందుగా సునీతే పురుగు మందు తాగింది. ఆ తర్వాత వంశీ మాత్రం తనకు భయంగా ఉందంటూ అక్కడి నుండి పారిపోయాడు. సునీత విషయం తెలుసుకున్న బంధువులు ఆమెను గుంటూరు జిజిహెచ్ కు తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సునీత మృతిపై అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వంశీని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుండి పూర్తి సమాచారాన్ని రాబట్టారు. దీంతో వంశీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. సునీత అడ్డుతొలగించుకునేందుకే వంశీ చనిపోదామన్న డ్రామా ఆడినట్లు పోలీసులు చెప్పారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…