హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో చోరి కలకలం.. మైనంపల్లి ఇంటికి కన్నం వేసిన దొంగలు.. రంగంలోకి పోలీసు ఉన్నతాధికారులు..!
ఎటు చూసినా సిసి కెమెరాల నిఘా.. చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. అయినా నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో దొంగలు పడ్డారు.

Theft at MLA Quarters అది మాజీ ఎమ్మెల్యేలు నివాసముండే ప్రాంతం.. చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు.. ఎటు చూసినా సిసి కెమెరాల నిఘా.. నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో దొంగలు పడ్డారు. అక్కడ చోరీ కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
హైదరాబాద్ హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో చోరి సలచలనంగా మారింది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నెంబర్ 305 లో చోరీ జరిగింది. మైనంపల్లికి అలాట్ చేసిన ఫ్లాట్‌లో ఆయన బంధువు అమర్‌నాథ్ బాబు ఫ్యామిలీ ఉంటుంది. గత కొంతకాలంగా ఇక్కడే నివాసం ఉంటోంది. అయితే నిన్న సాయంత్రం బంగారం చోరీకి గురైంది. 14.6 తులాల బంగారంతో పాటు రూ.10వేల నగదు అపహరణకు గురైంది. దీంతో స్థానిక పోలీసులకు అమర్‌నాథ్ ఫిర్యాదు చేశారు.
శుక్రవారం సాయంత్రం జరిగిన చోరీని చేధించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. చోరీపై పోలీసులు గోప్యత పాటిస్తున్నా.. పదుల సంఖ్యలో పోలీసులు పహారా కాచే క్వార్టర్స్‌లో చోరీ కావడం అనుమానాలకు తావిస్తోంది. అమర్‌నాథ్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Read Also… ఫిబ్రవరి 1 నుంచి ఓయూ పరిధిలో తెరుచుకోనున్న విద్యాసంస్థలు.. అయితే, వారి సమ్మతి తప్పనిసరి..!