Adilabad Bus Accident: ఆదిలాబాద్ జిల్లాలో అదుపుతప్పి బోల్తా పడ్డ ట్రావెల్ బస్సు.. ఐదుగురికి గాయాలు..
ఆదిలాబాద్ జిల్లాలో అదుపు తప్పిన బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈఘటనలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇచ్చోడ హైవేపై ప్రైవేటు బస్సు ప్రమాదశాత్తు బోల్తాపడింది.
Adilabad Bus Accident: ఆదిలాబాద్ జిల్లాలో అదుపు తప్పిన బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈఘటనలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇచ్చోడ హైవేపై ప్రైవేటు బస్సు ప్రమాదశాత్తు బోల్తాపడింది. ఘటనలో ఐదుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటీన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను రిమ్స్‌కు తరలించారు. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. మిగిలిన ప్రయాణికులకు ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Also… ఏపీః టెన్త్ పాసైన విద్యార్ధులకు అలెర్ట్.. ఆన్‌లైన్‌లో మైగ్రేషన్ సర్టిఫికేట్.. వివరాలివే..