AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Police Joint Operation: తెలంగాణ, కర్ణాటక పోలీసుల జాయింట్‌ ఆపరేషన్‌.. కరుడుగట్టిన నేరస్థుడు అరెస్టు

Police Joint Operation: తెలుగు రాష్ట్రాల్లో చైన్‌ స్నాచర్లు రోజురోజుకు ఎక్కువైపోతున్నారు. మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు మెడలో ఉన్న బంగారు అభరణాలను ...

Police Joint Operation: తెలంగాణ, కర్ణాటక పోలీసుల జాయింట్‌ ఆపరేషన్‌.. కరుడుగట్టిన నేరస్థుడు అరెస్టు
Subhash Goud
|

Updated on: Jan 16, 2021 | 6:44 PM

Share

Police Joint Operation: తెలుగు రాష్ట్రాల్లో చైన్‌ స్నాచర్లు రోజురోజుకు ఎక్కువైపోతున్నారు. మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు మెడలో ఉన్న బంగారు అభరణాలను దొంగిలించి పరారైపోతున్నారు. ఇలాంటి కేసులు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వారి పని పట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగి వారిని పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టేస్తున్నారు. కొందరు పోలీసుల కళ్లు గప్పి తప్పించుకుని తిరుగుతుండటంతో వారిని పట్టుకోవడంలో పోలీసులకు సవాలుగా మారింది. ఎన్ని రోజులు తప్పించుకుని తిరిగినా.. పోలీసులకు చిక్కడం ఖాయమని తెలంగాణ పోలీసులు రుజువు చేశారు.

చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతూ తప్పించుకుని తిరుగుతున్న నేరస్థుడిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా కరీనంగర్‌లో తెలంగాణ, కర్ణాటక పోలీసులు జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. 45 రోజుల పాటు ఖాకీ సినిమా తరహా ఆపరేషన్‌ నిర్వహించిన పోలీసులు.. కరుడుగట్టిన నేరస్థుడు భాకర్‌ ఆలీని అరెస్టు చేశారు. నిందితుడిపై ఇప్పటి వరకు 118 కేసులు, తెలంగాణ, ఏపీ, కర్ణాటకల్లో పీడీ యాక్ట్‌ కేసులు కూడా ఉన్నాయి. 2015 ముందే హైదరాబాద్‌లో వందకు పైగా చైన్‌ స్నాచింగ్‌ చేసిన ఇరానీ గ్యాంగ్‌ దొంగ.. కరీంనగర్‌లోని ఓ దొంతనం కేసు విషయంలో సినీపక్కిలో భాకర్‌ అలీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.

బీదర్‌కు చెందిన భాకర్‌ ఆలీని పట్టుకునేందుకు పోలీసులు వందలాది సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇతని కోసం 200 మంది పోలీసులు సిబ్బంది కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేరస్థుడి కోసం కరీంనగర్‌ పోలీసులు బీదర్‌ వెళ్లి పట్టుకున్నారు. నవంబర్‌ నుంచి తెలంగాణలో 19 చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. అలాగే డిసెంబర్‌ 8న ఒకే రోజు ఏపీలోని కృష్ణా జిల్లాలో ఐదు చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. అయితే భాకర్‌ ఆలీని పట్టుకునేందుకు పోలీసులు ముంబై, పూణే, హైదరాబాద్‌, బెంగళూరు, సోలాపూర్‌, బీదర్‌ ప్రాంతాల్లో సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపడుతున్న పోలీసులపైనే నేరస్థుడు దాడి చేసేందుకు యత్నించాడు. ఎట్టకేలకు భాకర్‌అలీని పోలీసులకు చిక్కాడు. అయితే ప్రాణాలను తెగించి కరుడుగట్టిన నేరస్థుడిని పట్టుకున్న పోలీసులకు తెలంగాణ డీజీపీ రివార్డు ప్రకటించారు. కాగా, నేరస్థుడి నుంచి గంజాయితో పాటు కార్డు స్వాధీనం చేసుకున్నారు.

Also Read:

Man Arrested: మాజీ డీజీపీ ఇంట్లో చోరీ.. ఏం దొంగిలించాడో తెలిస్తే షాక్ అవుతారు..