Crime News: మద్యం మత్తులో భర్త వేధింపులు.. భరించలేక ముగ్గురు పిల్లలకు విషమిచ్చిన భార్య.. ఆ తర్వాత ఏంచేసిందంటే..?
తమిళనాడు రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ మహిళ.. కని పెంచిన ముగ్గురు పిల్లలను హతమార్చి తానూ బలవన్మరణానికి పాల్పడింది.
Tamil Nadu Family Suicide: తమిళనాడు రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ మహిళ.. కని పెంచిన ముగ్గురు పిల్లలను హతమార్చి తానూ బలవన్మరణానికి పాల్పడింది. మద్యానికి బానిసైన భర్తను మానిపించలేకపోయింది. బతుకే భారంగా కాలం వెళ్లదీయలేక అనంతలోకాలకు పయనమైంది ఆ కుటుంబం. కుటుంబ కలహాల కారణంగా ముగ్గురు పిల్లలను హత్య చేసిన తల్లి ఆత్మహత్య చేసుకొన్న విషాద ఘటన వేలూర్‌లో చోటు చేసుకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు విగతాజీవులుగా మారడంతో వేలూరు వాసులను తీవ్ర కలచివేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
పోలీసుల కథనం మేరకు… వేలూర్ తోటపాళ్యంకు చెందిన దినేష్ టైల్స్ అంటించే వృత్తిలో ఉన్నాడు. వేలూర్ సలవన్‌పేటకు చెందిన జీవితతో (23) ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి అక్షయ (5), నందకుమార్ (4), 6 నెలల పాప ఉన్నారు. కుటుంబం సలవన్‌పేట కచ్చేరి వీధిలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. దినేష్ నిత్యం మద్యం మత్తు సేవిస్తూ కుటుంబాన్ని పట్టించుకోవడమే మానేశాడు. ఈ క్రమంలో భార్యా-భర్తల మధ్య తరుచూ గొడవలు తలెత్తాయి. అంతేకాకుండా భార్యను చిత్రహింసలు పెట్టేవాడని స్థానికులు తెలిపారు.
ఈ క్రమంలోనే 10 రోజుల క్రితం భర్తతో వివాదం కారణంగా జీవిత.. అతని నుంచి దూరంగా వెళ్లానుకుంది. తిరుప్పూరు కుమరన్ 2వ వీధిలో ఉన్న తన పుట్టింటికి ఆమె పిల్లలతో వెళ్లింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం తమ ఇంటికి వెళుతున్నట్లు కుటుంబసభ్యులకు చెప్పి బయలుదేరింది. దినేష్ ఉదయం 7 గంటలకే పనికి వెళ్లిపోయాడు. జీవిత తల్లి సాయంత్రం 5 గంటలకు ఆమెకు ఫోన్ చేసింది. సమాధానం రాకపోడంతో అనుమానంతో తన కుమారుడు జగదీశ్వరన్‌కు ఫోన్ చేసి వెళ్లి చూసి రావాలని కోరింది. అతను జీవిత ఇంటికి వెళ్లి చూడగా తలుపులు గడియ పెట్టి ఉన్నాయి. కిటికీలో నుంచి ఇంటి లోపలి గడియను తీశాడు. లోనికి వెళ్లగా ముగ్గురు పిల్లలు, సోదరి విగతజీవులుగా కనిపించారు. దీంతో ఇరుగు పొరుగు వారి సహాయంతో పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ముగ్గురు పిల్లలను గొంతు నులిమి చంపిన జీవిత.. తానూ చీరతో ఉరేసేుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన వేలూర్ దక్షిణ పోలీసులు.. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాత్రి సమయంలో ఇంటికి వచ్చిన దినేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
Read Also… ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నది దాటుతున్నారు.. మెక్సికోలోకి హైతియన్లు.. ఎందుకలా..?? వీడియో